Home / Entertainment / కళాభవణ్ మణి ని హత్య చేసారా?

కళాభవణ్ మణి ని హత్య చేసారా?

Author:

Kalabhavan-Mani

మళయాళీ నటుడు కళాభవణ్ మణిది సహజ మరణం కాదా? ఆయన మీద విష ప్రయోగం జరిగిందా? ఔననేనే అంటున్నాయి తాజా పరిణామాలు. మణి మృతి పై వచ్చిన అనేక అనుమాణాల నేపథ్యంలో అది సహజ మరణం కాదేమో అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇదే అనుమానం తో మణి భౌతిక కాయానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు.

పోస్టు మార్టం ద్వారా సేకరించిన శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించగా శరీరంలో రసాయన పదార్థం ఉన్నట్టు గుర్తించామని ఆయనకు పోస్టు మార్టం నిర్వహించిన ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆస్పత్రి వర్గాలు మణిది అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మణి ఆకరి క్షణాల్లో గడిపిన ఫాంహౌస్‌లో ఇవాళ ఉదయం ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్కాడ్‌తో దర్యాప్తు చేపట్టారు. కళాభవన్‌ మణి కాలేయ సంబంధ వ్యాధితో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించిన విషయం పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మార్చి 5 శనివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొచ్చిలోని అమ్రిత ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు. అత్యవసర చికిత్సకై ఐసీయూలో వైద్యులు చికిత్స చేశారు. “పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచాం. ఆదివారం రాత్రి 7.15గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు’ అని వైద్యులు తెలిపారు.కోచిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 7.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. కళాభవన్.మణిది సహజ మరణమా కాదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నా మరి కొద్ది రోజుల్లోనే నిజనిజాలు బయటికి వస్తాయని తెలిపాయి ఈ కేసును విచారిస్తున్న పోలీసు వర్గాలు.

(Visited 261 times, 1 visits today)