Home / Inspiring Stories / కొడుకు చదువుకు వేల ఫీజులు కట్టలేక కలెక్టర్ ముందు డ్యాన్స్ చేసిన పేద తండ్రి.

కొడుకు చదువుకు వేల ఫీజులు కట్టలేక కలెక్టర్ ముందు డ్యాన్స్ చేసిన పేద తండ్రి.

Author:

ఎల్కేజీ లో చేర్చుకోవటానికి కూడా లక్షకు తగ్గకుండా ఫీజులు వసూలు చేస్తూ  వ్యాపార ఖర్మాగారాలుగా మారిన స్కూళ్ళను చూస్తూనే ఉన్నాం. ఆఖరికి అరకొర వసతులుండే ప్రవేటు స్కూళ్ళు కూడా వేలల్లో టర్మ్ ఫీజులూ, డొనేషన్లూ అంటూ రకరకాల పేర్లతో డబ్బులు దండుకుంటున్నాయి… ఈ తరహా వైఖరి తో డబ్బులేని వాడి పిల్లల భవిశ్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. రెండురోజుల క్రితం స్కూలు ఫీజులంటూ యాజమాన్యం వేదించటంతో ఉక్రోషం కోపంగా మారి తన చేతులతోనే తనపిల్లలిద్దరినీ చంపేసాడో తండ్రి. అయితే మధ్య ప్రదేశ్లోని మాంద్సూర్కి చెందిన దశరథ్ సూర్యవంశ్ మాత్రం మరో దారి ఎంచుకున్నాడు. మరికొందరు తన లాంటి పేద తండ్రులను ఆలోచనలో పడేశాడు. అధికారులను కాస్త కళ్ళు తెరుచుకునే లా చేసాడు. తన కొడుకు చదివే స్కూలు వారడిగిన ఫీజు చెల్లించలేక, తన కొడుకుకు విద్యావకాశం కల్పించాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నాడు. తన కొడుకుకు చదువుకునే అవకాశం వస్తుందని ఎదురు చూసాడు అయినా ఫలితం కనిపించకపోవడంతో విసిగి పోయాడు ఇక లాభం లేదంటూ ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా ఉన్నతాధికారుల ముందు డాన్స్ చేశాడు. దీంతో షాకైన కలెక్టర్ సంబంధించి చర్యలకు ఆదేశించారు.

సూర్యవంశ్ కొడుకు అడ్మిషన్ కోసం స్థానిక ప్రయివేటు స్కూలు రూ. 27 వేలు డిమాండ్ చేసింది. దీంతో ప్రాథమిక విద్యాహక్కు చట్టం కింద తనకు న్యాయం చేయాలంటూ అతడు జిల్లా అధికారులను ఆశ్రయించాడు. అయినా ఫలితం కనిపించలేదు. ఈ మొత్తం వ్యవహారంతో విసిగిపోయి సాక్షాత్తూ కలెక్టర్ ముందు వెరైటీగా నిరసనకు దిగాడు. మీడియా ప్రతినిదులు ఉన్న సమయం లో కలెక్టర్ ఆఫీసులోకి ప్రవేశించిన అతను వింత భంగిమలతో డాన్స్ చేసాడు. అధికారులు పట్టించుకోకపోవటం తో ఈ తరహా నిరసన తెలియ జేసానని చెప్పాడు. దీంతో సూర్యవంశ్కు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్, విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

(Visited 313 times, 1 visits today)