Home / Inspiring Stories / పట్టుదల ముందు పట్టువదిలిన పేదరికం

పట్టుదల ముందు పట్టువదిలిన పేదరికం

Author:

K.-Jayaganesh ias

మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ….
కృషి వుంటే మనుషులు ఋషులవుతారు
మహా పురుషులవుతారు
తరతరాలకి తరగని వెలుగవుతారు
ఇలవేలుపులవుతారు……అని వేటురి అన్నట్టు

మనిషిగా పుట్టి,ఒక బొమ్మలాగా ఉండకుండ పట్టుదలగ వుండి తనకంటు ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలి. కృషి, నిరంతర పట్టుదల ఉంటే సాధించనిది అంటు ఏమీ లేదు అని నిరుపించాడు ఒక యువకుడు. ఆ యువకుడు పేద కుటుంబంలో పుట్టి, అడుగడుగునా అడ్డంకులు ఎదురుకొని వెయిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి 5 సార్లు ప్రయత్నించి విఫలమైనా 6వ సారి పరీక్షలో ఐఏఎస్‌కు సెలెక్ట్ అయి తన సత్తా నిరూపించుకొని, అనుకున్న ఐఏఎస్ కలని సాకారం చేసుకున్నాడు.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి చెందిన కె.జయగణేష్ పుట్టుకతోనే నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతనితో పాటు చిన్నవారు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. తోబుట్టువులలో పెద్దవాడు కావడం వలన చిన్నతనం నుంచి తమ కుటుంబ కష్టాలను తెలిసినవాడు కావడం వలన బాగా చదివి ఎలాగైనా తన కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలని నిరతరం కష్టపడుతూ చదువును మాత్రం ఎప్పుడూ అశ్రద్ద చేయలేదు. జయగణేష్‌ తండ్రి స్థానికంగా ఉండే ఓ లెదర్ ఫ్యాక్టరీలో కార్మికుడు. తనకు నెల అంతా కష్టపడితే వచ్చేది మాత్రం రూ.4,500. ఈ జీతంతోనే తన కుటుంబాన్ని ఎలాగోలా నడిపించేవారు జగదీష్ తండ్రి.

జయగణేష్‌ చిన్నప్పటి నుండి చదువులో ఎప్పుడు ముందే వుండేవాడు. ఎందుకంటే తన కుటుంబ పరిస్థితి తనకు తెలుసు, ఎలాగైన తను మంచి ఉద్యోగం చేసి వారి జీవితంలో వెలుగు ఇవ్వాలని చిన్నప్పటి నుండి ఎవ్వరేమన్న పట్టించుకోకుండా చదువును మాత్రమే నమ్ముకున్నాడు. ఇంటర్‌లో దాదాపు 91 శాతం మార్కులతో డిస్టింక్షన్ సాధించాడు. ఆ తర్వాత థాంథయ్ పెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నా అవకాశాలు దొరక్కపోవడంతో బెంగుళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో రూ.2,500 నెల జీతానికి కార్మికుడిగా చేరాడు.

చిన్నప్పటి నుండి ఎలాగైనా ఐఏఎస్ కావాలని తన మనస్సులో నిశ్చయించుకున్నాడు. అయితే ఐఏఎస్ సాధించాలంటే మాటలు కాదు. రోజుకు కనీసం 18గంటలు చదువుకే కేటాయించాలి.అలాగే తనకు ఆ కోర్సు గురించి అవగాహన కల్పించే వారు ఎవరూ దొరకలేదు. అయిన పట్టుదలగా చదివి మొదటి రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలోనే ఫెయిల్ అయ్యాడు. అప్పుడు తన సబ్జెక్ట్ మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి సోషియాలజీకి మార్చుకున్న మూడోసారి కూడా ఫలితం శూన్యం. ఇటు పరీక్షలు ఫెయిల్ అవడం అటు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడం అతని జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. తన ఆర్దిక ఇబ్బందులను తొలగించుకోవడం కోసం అతను బెంగుళూరు నుంచి చెన్నై నగరానికి వెళ్లి అక్కడ ఓ క్యాంటీన్‌లో పార్ట్ టైం బిల్లింగ్ క్లర్క్‌గా చేరాడు. ఖాళీ దొరికితే ఆ క్యాంటీన్‌లోనే వెయిటర్‌గా కూడా విధులు నిర్వహించేవాడు.ఓ వైపు వెయిటర్ జాబ్, మరో వైపు ఐఏఎస్ ప్రిపరేషన్. రెండింటినీ జయగణేష్ ఎంతో శ్రద్దతో నిర్వహించిన దురదృష్టం జయగణేష్‌ని వెంటాడటం వలన 4, 5వ సారి కూడా అతను ఐఏఎస్ ప్రిలిమినరీలో ఫెయిలయ్యాడు.

ఇక లాభం లేదని చేస్తున్న వెయిటర్ జాబ్‌ను జయగణేష్ వదిలేసి ఓ ప్రైవేటు శిక్షణా సంస్థలో యూపీఎస్‌సీ సోషియాలజీ చెప్పే అధ్యాపకుడిగా జాయిన్ అయ్యాడు. మొత్తనికి జయగనేష్ కి 6వ సారి అదృష్టం వరించింది. ఐఏఎస్ ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయ్యాడు కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు సాదించాలనుకున్నది మిస్ అయిందని భాధపడాల లేక బ్యాకప్ ఆప్షన్‌ ఎంచుకోవాల అనేది తెలియలేదు కాని చివరికి బ్యాకప్ ఆప్షన్‌గా ఇంటెల్లిజెన్స్ బ్యూరో అధికారి పోస్టు కోసం పరీక్ష రాశాడు. దీంతో మరోసారి ఐఏఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. చిట్ట చివరిగా 7వ సారి ఐఏఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. మెయిన్స్, ఇంటర్వ్యూలను కూడా క్లియర్ చేశాడు. దీంతో అతని జీవిత కల సాకారమైంది. ఆలిండియా వ్యాప్తంగా జయగణేష్‌కి సివిల్స్‌లో 156వ ర్యాంక్ వచ్చింది. పట్టు పట్టరాదు పడితే వదులరాదు అనే సామెత సరిగ్గా సరిపోతుంది జయగణేష్‌ విషయంలో, అందుకే   అబ్దుల్ కలాం అన్నట్టు కలలు కనండి వాటిని సాకారం చేసుకొండి. పేదోడిగా పుట్టి దేశంలోనే అత్యున్నత స్థాయి పరీక్షలో విజయం సాధించిన జయగణేష్‌కి హ్యాట్సాఫ్.

(Visited 1,253 times, 1 visits today)