Home / Inspiring Stories / పేదవారి కోసం తక్కువ ధరకే రిఫ్రిజిరేటర్ వచ్చేసింది

పేదవారి కోసం తక్కువ ధరకే రిఫ్రిజిరేటర్ వచ్చేసింది

Author:

mitticool refrigerator

ఎండాకాలం ఉదయం నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. బిందెలో పోసిన నీరు కాచిన నీరులా వేదేక్కడటం, వారం రోజులు నిల్వ ఉండే కూరగాయలు ఒక్కరోజులోనే ఆరిపోవటం జరుగుతోంది. ఇలాంటి వాతావరణం లో రిఫ్రిజిరేటర్ తప్పనిసరి… కానీ రిఫ్రిజిరేటర్ కి అంత ధర పెట్టి పేదవాడు కొనలేని పరిస్థితి. కాని ఇప్పుడు పేదవాడు కొనుక్కోగల ధరకే రిఫ్రిజిరేటర్ వచ్చేసింది..అది కూడా విద్యుత్ వినియోగించకుండానే..

          అతను ఒక టీ స్టాల్ యజమాని, చదివింది కేవలం తొమ్మిది పాస్ పది ఫేల్ కాని, తనకు వచ్చిన ఒక ఆలోచనతో ఎంతో మంది మధ్య తరగతి వారి కోసం అతి తక్కువ ధరకు మట్టితో చేసిన రిఫ్రిజిరేటర్ తయారుచేశాడు.ఇప్పుడు సంవత్సరానికి తన కంపెనీ అయిన “మిట్టికూల్” 45లక్షల  టర్నోవర్ తో 35 మందికి ఉపాధిని ఇస్తున్నవ్యక్తి’ మనుష్క్ భాయ్ ప్రజాపతి’. మనుష్క్ భాయ్ ప్రధానవృత్తి కుండలు చేయడం,  వారి వృత్తి చేయడం లాభసాటిగా లేకపోవడం.. రోజు రోజుకి పనిలేకుండ పోతుంది. కానీ అతని ఆలోచన మాత్రం ఇంటి పైకప్పుకు వేసే పెంకలు మాత్రమే ఎందుకు మట్టితో చేయాలి మిగతావి ఎందుకు చేయాకూడదు అనే ఆలోచన..!

mitticool products

            అంతే ఒక్క ఆలోచన తన జీవితాన్నే మార్చేసింది మట్టితో రిఫ్రిజిరేటర్,కుక్కర్, ఫిల్టర్..ఇంక చాలా వాటిని తయారు చేసి వాటిని చాలా తక్కువ ధరలకు అమ్ముతున్నాడు. తన కంపెనిలో ఒక్క రిఫ్రిజిరేటర్ ధర 3000వేలు, ఎవరైన పేదవారు వస్తే ఇంకా తక్కువ ధరకే ఇస్తాడు. కానీ.. ఈ రిఫ్రిజిరేటర్ ఆవిష్కరణ అనుకున్నంత సులభంగా కాలేదు, దీని తయారికి నాలుగు సంవత్సరాలు పట్టింది. వివిధ ప్రాంతాలలో దొరికే ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే రెండు  మూడు రకాల మట్టిని కలిపి వీటిని తయారు చేయటం జరుగుతుంది, ఈ మట్టి ఫ్రిజ్ భాష్పీభవన సూత్రంపై పని చేస్తుంది.  రిఫ్రిజిరేటర్ పై భాగంలో నీరు నిల్వ ఉండేందుకు ఒక ప్లేస్ ఉంటుంది. నీరు పై భాగంలో నిల్వ ఉండటం వలన క్రింద ఆవిరి రూపంలో కూల్ గా ఉంటుంది. దానితో రిఫ్రిజిరేటర్ లో పెట్టిన కూరగాయలు చెడిపోకుండ ఉంటాయి.

         దీనిపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడనికి కారణం తక్కువ ధరలో రావడం అలాగే విధ్యుత్ అవవరం లేకపోవడం మరియు స్వచ్చమైన మట్టితో తయారు చేయాడంతో ఎలాంటి హాని జరుగదు అని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈ అద్బుత ఆవిష్కరణను మెచ్చి మాజి రాష్ట్రపతి అబ్దుల్ కాలాం మనుష్క్ భాయి దగ్గరికి వెళ్ళి మరీ ప్రశంసించారు.

abdulkalam visits mitticool company

            ఈ మిట్టికూల్ రిఫ్రిజిరేటర్ ఇప్పుడు ఒక్క మన భారతదేశంలోనే కాదు దుభాయ్,ఆఫ్రికా వంటి దేశాలకు కూడ పంపిస్తున్నాడట మన మనుష్క్ భాయ్. మిట్టికూల్ అనేది ప్రపంచ దేశలన్నిటిలోకి చేరాలని ఆశీద్దాం.

(Visited 6,687 times, 1 visits today)