Home / health / మీరు వాటర్ ప్యాకెట్స్, బాటిల్స్ లో నీరు తాగుతున్నారా! అయితే మీ ఆరోగ్యం జాగ్రత!

మీరు వాటర్ ప్యాకెట్స్, బాటిల్స్ లో నీరు తాగుతున్నారా! అయితే మీ ఆరోగ్యం జాగ్రత!

Author:

అసలే ఎండకాలం బయటికి వెళితే ఎండలు మండిపోతున్నాయి. రెండు రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి కబట్టి కొద్దిగా వాతవరణం చల్లబడింది లేకుంటే ఎండలకు ఎంతమంది ఇబ్బందులు పడేవారో. మళ్ళీ రెండు రోజులు అయితే ఎండలు శర మాములే, ఎండలకు బయటికి వెల్లినప్పుడు మనం ఎక్కువగా చేసే పని వాటర్ ఎక్కువగా తాగడం. ఎండకాలం వాటర్ తాగటం మంచిదే కానీ మనకు అందుబాటులో ఎక్కువగా దొరికేవి వాటర్ ఫ్యాకెట్స్, వాటర్ బాటల్స్ మాత్రమే. మనం వాటిని డబ్బులిచ్చి మరి తీసుకుంటాం అవునా! కానీ అవే ఇప్పుడు మన పాలిటా శాపంగా మరుతున్నాయి అవును మీరు వింటున్న మాట నిజం… ఎందుకంటే  కిన్లేలాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/-అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది.

pot-water-is-far-better-than-packed-water

ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక రకమైన కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారట!.ఈ మాట అంటుండి ఎవరో కాదు జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ రీసెర్చ్. ఎందుకంటే బయట మనకు లభ్యమయ్యే మినరల్ వాటర్ బాటిళ్ళలో కొలీఫాం బాక్టీరియా ఉంటున్నట్లు ఆ సంస్థ తమ రీసెర్చీ లో కనుక్కోంది. ఈ బ్యాక్టీరియా వలన మనకు చాలా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ రీసెర్చ్ వారు. ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 15 నుండి 20 రకాల వాటర్ బాటిల్లను ‘ఘజియాబాద్ నేషనల్ టెస్ట్ హౌస్’ లో నిర్వహించిన పరీక్షల్లో బాటిళ్లలో ఈ వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ విషయంపై స్పందించిన ‘ఇండియన్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ’ అనుమతులు లేకుండా నడుపుతున్న కంపెనీలపై చర్యలకు సిద్ధమవుతోంది.బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్లగా మారిపోతున్నాయి.దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి.

అయితే ఈ విషయంపై “రోబ్ రీడ్” అనే శాస్త్రవేత్త రాగి, ఇత్తడి, మట్టి పాత్రలలో విరోచనకారి అయిన బ్యాక్టీరియాను వేసి 24 గంటల తర్వాత పరిశీలించాడట! బ్యాక్టీరియా కొద్దిగా తగ్గిండట! దానితో మరో 24గంటల తర్వాత అంతే 48గంటల తర్వాత పరిశీలిస్తే బ్యాక్టీరియా పూర్తిగా నశీంచిందట!అలాగే ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది అని కనుగొన్నారు. కావున మనం ఆరోగ్యంగా ఉండలంటే ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగకపోవడే మంచిది. ఎందుకంటే డబ్బులిచ్చి మరి జబ్బులు తెచ్చుకునే పరిస్థితి మనకు ఎందుకు!?.

(Visited 3,640 times, 1 visits today)