Home / Inspiring Stories / చీకటి జీవితాలు – సుఖాన్ని పంచి ఆవిరవుతున్నారు.

చీకటి జీవితాలు – సుఖాన్ని పంచి ఆవిరవుతున్నారు.

Author:

prostitute life

కొందరి జీవితాలు వడ్డించిన విస్తరి, ఇంకొందరి జీవితాలు విస్తరిలోని మిగిలిన ఎంగిలి మెతుకులు… కానీ వారు కావాలని ఆ జీవితాన్ని ఎంచుకోలేదు తప్పని తెలిసిన తప్పక చేయవలసి వస్తుంది. వీరి జీవితంలో ఎన్నో ఆటుపోటులు వాటన్నిటికి తట్టుకొని వారు ఎంచుకున్న జీవితాన్ని గడపవలసి ఉంటుందని తెలిసి మరి ఈ జీవితాన్ని గడుపుతున్నారు..

వారి జీవితం అంత చీకటితో ముడిపడి ఉంటుంది. చీకటి అవ్వడమే ఆలస్యం ఒక్కోక్కరుగా వారి ఇంటి ముందు వాలి పోతుంటారు. వచ్చిన వారు నచ్చిన నచ్చకున్న వారికి ఇవ్వల్సిన సుఖాన్ని ఇచ్చి పంపివేయాలి లేదంటే మళ్ళీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే ఎప్పూడు వచ్చేవారు ఐతే కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇస్తారని ఆశ అంతే…

ఇందులో ఇంక కొన్ని జీవితాలు ఉంటాయి, వారు పుట్టిన జీవితానకి ఇప్పుడు అనుభవిస్తున్నజీవితానికి అస్సలు సంబంధం ఉండదు. ఎందుకంటే వారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి బలవంతంగా నెట్టబడినవారు. తల్లి ఆవు నుండి పిల్ల దూడను కటిక వాడు వేరు చేసినప్పుడు తల్లి, పిల్లల బాధ వర్ణనాతీతం, ఎందుకంటే ఇందులో ఎక్కువగా బలవంతంగా ఎత్తుకొచ్చిన వారి జీవితాలే ఉంటాయి కాబట్టి. ఇక వారి జీవితాలు ఎలా అంటే రోజుకో వాత లేద రోజుకో చావు దెబ్బ అన్నట్టు వుంటుంది. ఈ బాధలను మర్చిపోవడానికి వారు తాగుడుకు బా’ నీస ‘లు గా తయారు అవుతారు. వారీ ఇంటి ముందు నిల్చోని చూసే కొంటే చూపుల వెనుక ఎన్నో భాధలు ఉంటాయన్న విషయం ఎవ్వరికి తెలియదు. వీరీ అందాన్ని చూసి వచ్చే వారికి వారు కోరుకున్నది ఇవ్వలేకపోయినా లేదా వీరి ఆరోగ్యం భాగాలేకపోయిన సిగరెట్ గుర్తులు వీరి శరిరంపై ముద్దుల వర్షం కురిపిస్తాయి.

ఈ పాడు జీవితంలో జన్మించిన ఆడపిల్లను వారి తల్లి ఈ జీవితానికి దూరంగా పెంచాలని చూస్తుంటుంది కాని పిల్లలు పెరిగేకొద్ది వారి తల్లుల భాదను చూసి ఇన్ని సంవత్సరాలు చూసుకూంటు పెరిగి వారి శేష జీవితంలోనైన వారికి భాదలు ఉండకూడదని వారి పిల్లలు కూడా ఈ మురికి కూపంలోకి వస్తుంటారు. వారు ఈ మురికి కూపంలో పుట్టి మురికికూపంలోనే తనువు చాలిస్తారు. వారు చేసిన పాపం ఎమిటి ఆడపిల్లలుగా పుట్టడమేనా!?……. మన దేశంలో ఇలా ఎంతో మంది ఈ మురికి కూపంలో వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఒక్క ఆంద్రప్రదేశ్ లోనే ఇలాంటి వారు దాదాపు ఒక లక్ష మంది ఉన్నారని అంచనా, అలాగే తెలంగాణలో ఎక్కువగా పాతబస్తిలో దాదాపు ఒక నలబై వేల మంది ఉన్నారని అంచనా అలాగే ఇతర జిల్లాలలో కూడా ఉన్నారని ఈ మధ్య చేసిన ఒక సర్వేలో తెలిసింది. ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా పేదరికం కారణంగానే ఇలా జరుగుతుందని అంచన వేశారు.

(Visited 495 times, 1 visits today)