Home / Entertainment / నా డ్రీమ్ గర్ల్ కోసం వెయిటింగ్ – ప్రభాస్

నా డ్రీమ్ గర్ల్ కోసం వెయిటింగ్ – ప్రభాస్

Author:

Prabhas Marriage

గత ఏడాది బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్. సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘బాహుబలి 2’కి సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. తెలుగులో ఉన్న యంగ్ హీరోస్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చినా ఏదో ఒకటి చెప్పి మాట దాటేసాడు.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ని పెళ్లి గురించి అడిగితే ‘ప్రస్తుతం నేను బాహుబలి పార్ట్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను. పెళ్లి గురించి వాస్తవం లేని వార్తలు చాలా వస్తున్నాయి. నేను ఇంకా నా డ్రీమ్ గర్ల్ ని కలవలేదు. చెప్పాలి అంటే నా డ్రీం గర్ల్ కి ఏమేమి క్వాలిటీస్ ఉండాలో కుడా నాకు తెలియదు. నాకు నా డ్రీమ్ గర్ల్ దొరికితే కచ్చితంగా అందరికీ చెప్తానని’ ప్రభాస్ పెళ్లి గురించి ఉన్న విషయాలను క్లియర్ చేసాడు. గత ఏడాది ప్రభాస్ ఎవరినో పెళ్లి చేసుకోనున్నాడని ఆ అమ్మాయికి సంబందించిన ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని కృష్ణంరాజు కొట్టి పారేసాడు. దీని ప్రకారం ప్రభాస్ బాహుబలి 2 అయిన తర్వాత కచ్చితంగా పెళ్ళి చేసుకుంటాడనే సంకేతాలు వస్తున్నాయి.

(Visited 104 times, 1 visits today)