Home / Entertainment / “లోఫర్” ఆడియోకి బాహుబలి.

“లోఫర్” ఆడియోకి బాహుబలి.

Author:

Prabhas to Attend Loafer Audio Launch

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమవుతూ కమర్షియల్ ఇమేజ్ వైపు వెళ్ళకుండా, మొదటి రెండు సినిమాలైన ‘ముకుంద’, ‘కంచె’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసాడు హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ నుంచి వస్తున్న మూడవ సినిమా ‘లోఫర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో పూరి మదర్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ సినిమాలో రేవతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు. వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపించే ఈ సినిమా ద్వారా దిశా పటాని హీరోయిన్ గా పరిచయం కానుంది. సి కళ్యాణ్ నిర్మాత. పూర్తి కమర్షియల్ సినిమాగా రానున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ఫినిష్ చేసుకుంటోంది. ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 7న, సినిమాని డిసెంబర్ 18న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

లోఫర్ ఆడియో డిసెంబర్ 7న హైదరబాద్లోని శిల్పకళవేదికలో గ్రాండ్ గా చేయనున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ కి మొదటగా స్టార్ మెగా హీరో ముఖ్య అతిధిగా వస్తారని భావించారు. కానీ ఫైనల్ గా ఈ వేడుకకి టాలీవుడ్ బాహుబలి అలియాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడని సమాచారం. ప్రభాస్ – పూరిలకి మంచి సాన్నిహిత్యం ఉంది. దానివలనే పూరి అడగ్గానే ప్రభాస్ వస్తానని మాటిచ్చాడని సమాచారం.

(Visited 45 times, 1 visits today)