Home / Entertainment / ప్రభాస్ ‘దందా’ చేయ్యనున్నాడా?

ప్రభాస్ ‘దందా’ చేయ్యనున్నాడా?

Author:

Prabhas, Krishnam Raju

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసి, రాఘవేంద్ర ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. ఈ పేరు ఇప్పుడు ఇండియా మొత్తం మారు మ్రోగి పోయింది. దానికి కారణం ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించిన ‘బాహుబలి’ సినిమా. ఈ ఏడాది రిలీజ్ అయ్యి ఇండియాలోనే టాప్ 5 గ్రాసర్స్ లో మూడవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి 2’ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. డిసెంబర్ 14 నుంచి ‘బాహుబలి 2’ సెట్స్ పైకి వెళ్లనుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేస్తాడు అనే ఆసక్తి అయితే నెలకొంది. అయితే అంతకు ముందు రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ పెదనాన్న అయిన కృష్ణరాజు చాలా రోజుల నుంచి ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు అని అందరికి తెలిసిన విషయమె అయితే ఇప్పుడు కృష్ణంరాజు తన హోం బ్యానర్ అయిన గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై ‘దందా’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేసారు. ఫుల్ మాస్ గా ఉన్న ఈ టైటిల్ ని ప్రభాస్ కోసమే రిజిష్టర్ చేసినట్లు సమాచారం. మరి ఈ సినిమాకి దర్శకుడిగా కూడా కృష్ణంరాజు వ్యవహరిస్తాడా లేక వేరే ఎవరన్నా డైరెక్ట్ చేస్తారా అన్నది చూడాలి.

(Visited 107 times, 1 visits today)