Home / Entertainment / డబ్బింగ్ సినిమాలతో మరో రికార్డ్ సృష్టించనున్న -రెబల్ స్టార్

డబ్బింగ్ సినిమాలతో మరో రికార్డ్ సృష్టించనున్న -రెబల్ స్టార్

Author:

prabhas latest photos

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. ఈ ఏడాది తను నటించిన ‘బాహుబలి’ సినిమా రికార్డ్స్ మీద రికార్డ్స్ ని సృష్టించి ప్రభాస్ ని ఇండియా వైడ్ బాగా ఫేమస్ చేసేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీలోని అందరి డిస్ట్రిబ్యూటర్స్ కి భారీగా లాభాలను తెచ్చి పెట్టింది. దాంతో ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకుందాం అని తమిళ, మలయాళ చత్రా నిర్మాతలు ప్రభాస్ సినిమాలను తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆ కోవలో ఇప్పటికే మిర్చి సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

దాంతో ఇప్పుడు ప్రభాస్ నటించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘రెబల్’ ని కూడా తమిళ తెలుగు భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసి డబ్బింగ్ వర్క్స్ ని ఫినిష్ చేస్తున్నారు. చెప్పాలంటే తమిల్, మలయాళంలో బాగా పేరున్న ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తోంది. అది కూడా డబ్బింగ్ సినిమాని, మలయాళంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. డబ్బింగ్ చేసిన సినిమాలు రిలీజ్ అవ్వడమే ఎక్కువ కానీ ఒకేసారి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న విష్యం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇలా రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి.అలాగే తను నటించిన హిట్ సినిమాలైన వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్,కూడా తమిళ మరియు మలయాళం లో రిలీజ్ చేయ్యడానికి పోటిపడుతున్నారు. అనగా డబ్బింగ్ సినిమాలతో కూడా ప్రభాస్ మరో రికార్డ్ ని సృష్టించాడు.

(Visited 144 times, 1 visits today)