Home / Entertainment / లవర్ బాయ్ అవతారమెత్తనున్న ప్రభాస్

లవర్ బాయ్ అవతారమెత్తనున్న ప్రభాస్

Author:

prabhas next movie as lover boy

ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు బాహుబలికి రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్‌’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఇప్పటికే ‘రన్ రాజా రన్’ దర్శకుడు సుజీత్‌, ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణలతో ఒక్కో సినిమాను చేసేందుకు ఫిక్స్ చేశాడు యంగ్ రెబల్ స్టార్. రాధాకృష్ణ తెరకెక్కించే సినిమాలో ప్రభాస్ పూర్తి స్థాయి లవర్ బాయ్ క్యారెక్టర్ చేయనున్నాడని వినికిడి. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నవే లేకుండా పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కథ నడుస్తుందని సమాచారం. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుండి ప్రభాస్ కత్తులు, గుర్రాలు, యుధ్ధాలు అంటు గడిపేశాడు. కానీ ఇక ముందు రాబోయే సినిమాలో క్లీన్ లవ్ స్టోరి ఉండేట్టు చూసుకుంటున్నాడు ప్రభాస్. రెబెల్ స్టార్ కృష్ణం రాజు నిర్మించనున్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే ఏడాది మొదట్లో గానీ సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది.

(Visited 211 times, 1 visits today)