Home / Entertainment / డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!

Author:

న్యూ ఇయర్ రోజు మోతాదుకు మించి మద్యం తాగి డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పోలీసులకి యాంకర్ ప్రదీప్ దొరికిన సంగతి తెలిసిందే, ఈ కేసు విషయంలో ప్రదీప్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసును విచారించిన నాంపల్లి కోర్టు ప్రదీప్ పై చర్యలు తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రదీప్ ఇప్పటికే గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కు తన తండ్రితో హాజరయ్యాడు.

Anchor_Pradeep_drink-and-drive-case

ఈ కేసులో కోర్టు ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ ని మూడేళ్ళ పాటు రద్దు చేస్తున్నట్లు. దానితో పాటు అత‌డికి రూ.2,100 జ‌రిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది, దాంతో మూడేళ్ళ పాటు ఎలాంటి వాహనాన్ని నడపడానికి ప్రదీప్ కి అవకాశం లేదు, ప్రదీప్ డ్రింక్ అండ్ డ్రైన్ లో దొరికినప్పటి నుండి ఈ కేసు సంచలనంగా మారింది, రెండు మూడు రోజులు ప్రదీప్ మీడియా ముందుకు, అటు పోలీసుల ముందుకు రాకపోవడంతో హైడ్రామా నడిచింది, పరారీలో ప్రదీప్, ప్రదీప్ కి జైలు శిక్ష అంటూ కథనాలు కూడా వెలుబడ్డాయి, చివరికి కోర్టు డ్రైవింగ్ లైసెన్స్, జరిమానాతో ప్రదీప్ ని శిక్షించింది.

(Visited 141 times, 1 visits today)