Home / Entertainment / ఊరి రామాయణం చేప్పబోతున్న ప్రకాశ్ రాజ్

ఊరి రామాయణం చేప్పబోతున్న ప్రకాశ్ రాజ్

Author:

mana uri raamayanam

విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాతగా, దర్శకుడిగానూ అద్భుతమైన ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. ఆకాశమంత, ధోని, ఉలవచారు బిర్యాని, గౌరవం లాంటి పలు అభిరుచి గల సినిమాలను రూపొందించి దర్శక నిర్మాతగా ప్రకాశ్, తనదైన బ్రాండ్ సృష్టించారు. ఇక తాజాగా ఈ కోవలో ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ భాషల్లో మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, లోగోను ఈ ఉదయం ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. మన ఊరి రామాయణం అన్న టైటిల్‌తో ప్రకాశ్ రాజ్ కొత్త సినిమా రూపొందనుంది.ఫస్ట్ లుక్ పోస్టర్ను చూస్తే ఈ సినిమా డ్రామా వారి జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇటీవలే ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ అక్కడి ప్రజల జీవన స్థితిగతులను కూడా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అందుకే సినిమా టైటిల్ను మన ఊరి రామయణం అని పెట్టినట్టుగా విశ్లేషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చనున్న ఈ సినిమాను ప్రకాష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ను చూస్తే ఈ సినిమా డ్రామా వారి జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇటీవలే ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ అక్కడి ప్రజల జీవన స్థితిగతులను కూడా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అందుకే సినిమా టైటిల్ను మన ఊరి రామయణం అని పెట్టినట్టుగా విశ్లేషిస్తున్నారు. ఓ ప్రక్కన నటుడుగా ఆయన బిజీగా ఉంటూనే ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. రీసెంట్ గా ఆయన కమల్ తో చేసిన చీకటి రాజ్యం చిత్రంలో ఆయన నటనకు గానూ మంచి ప్రసంశలు వస్తున్నాయి. కమల్ సైతం ఆయన్ని అభినందిస్తూ పార్టీ ఇచ్చారు.

(Visited 221 times, 1 visits today)