Home / Inspiring Stories / 199 బంతుల్లో 652 పరుగులు.., ఇండియన్ క్రికెట్ కి మరో ఆణిముత్యం ముంబై నుంచేనా?

199 బంతుల్లో 652 పరుగులు.., ఇండియన్ క్రికెట్ కి మరో ఆణిముత్యం ముంబై నుంచేనా?

Author:

Pranav Dhanwade

పాఠశాలలో చదువుతున్న సమయంలో సచిన్-కాంబ్లీ ద్వయం 1988లో ఆడిన హారిస్ షీల్డ్ మ్యాచ్‌ ఘటన గుర్తుందా..!? ఆ మాచ్ లో ఇద్దరూ కలిసి 664 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆతర్వాత ఇద్దరి విజృంబనా అంతర్జాతీయ క్రికెట్ లో ఎలా సాగిందో అదరికీ తెలిస్నిదే.కాంబ్లే 1993లో ఇంగ్లాండ్, జింబాబ్వేలతో జరిగిన టెస్ట్ మ్యాచుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలో సాధించి మంచి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.పదేళ్ళ తన క్రికెట్ కెరీర్ లో (1991-2000) 17 టెస్టులు, 104 వన్డేలతో సరిపెట్టుకున్నాడు. సచిన్ ప్రపంచ క్రికెట్ దేవుడిగా పిలచుకునేంతగా ఎదిగాడు. ఇప్పుడు అదే ముంబై నుంచి ఇంకో స్టార్ క్రికెటర్ అవతారం మొదలైందా…!? అంటే ఔనేమో అనే అనిపిస్తోంది 199 బంతులు 652 పరుగులు అందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు, చూసేవాళ్ళంతా నోళ్ళు వెళ్ళబెట్టేసారు. బ్యాటు పట్టుకొని చిందులు తొక్కిన ఈ కుర్రాడి ధాటికి గ్రౌండంతా కేరింతలతో నిండి పోయింది. ఇదివరలో 1899లో ఆర్థూర్ కోలిన్స్,1901లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ చార్లెస్ ఈడీ ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అప్పట్లో ఇంగ్లండ్‌ క్రికెటర్ ఆర్థూర్ కోలిన్స్ జూనియర్ హౌస్ మ్యాచ్‌లో 628 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిస్తే,ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ ఒక దేశీయ మ్యాచ్ లో 566 పరుగులు చేశాడు.

ఇప్పుడు ఆ పాత రికార్డులని పెవీలియన్ అవతల పడేలా కొట్టి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ముంబై కుర్రాడు సరికొత్త రికార్డు సృష్టించాడు. ముంబై స్కూల్ క్రికెటర్ ప్రణవ్ ధన్వాడే 199 బంతుల్లో 652 పరుగులు చేశాడు. 78 ఫోర్లు, 30 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్‌టీ భండారీ కప్ ఇంటర్ – స్కూల్ క్రికెట్ టౌర్నమెంట్‌లో పరుగుల సునామీ సృష్టించిన ప్రణవ్ నాటౌట్‌గా నిలిచాడు.

ప్రణవ్ తండ్రి ప్రశాంత్ ధన్వాడే ఓ ఆటో డ్రైవర్. ఐతే కొడుకు కెరీర్ కోసం ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. అతనికి ఇస్టమైన ఆట కోసం. ఆర్థికంగా తనకు భారమైనా అతన్ని ప్రోత్సహించాడు. ముంబై లోని కళ్యాణ్ ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో బాంద్రాలోని ఎంఐజిలో చేర్చటమే . తాను ఉదయం పూట ఆటోలో మైదానంలో దింపి సాయంత్రం ఇంటికి తీసుకుని వస్తుండేవాడినని, అయితే 2014 నుంచి ఆ పని మానేశానని, ప్రణవ్ సొంతంగా రావడం పోవడం అలవాటు చేసుకున్నాడని చెప్పారు. అప్పటి నుంచి ఇతర పిల్లలతో కలిసి వెళ్తున్నాడని చెప్పారు. ప్రణవ్ ఆడుతున్నప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఆయన మైదానం లో అడుగు పెట్టే టప్పటికే మనోడు 300 పరుగుల మైలు రాయి దాటాడు. ప్రణవ్ విజౄంబన తెలిసిన అతని క్లాస్ మేట్ తండ్రి ఒకరు ఫోన్ చేసి “మీరు ఆట చూడడానికి వెళ్లలేదా మీవాడు రెచ్చిపోతున్నాడక్కడ” అన్నారట,అప్పుడు తాను ఆటో వదిలి మైదానానికి వెళ్ళాడట. తన పదకొండేళ్ల కఠిన శ్రమకు ఫలితం దక్కిందని ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ తో మాట్లాడుతూ అన్నారు.

ఇక మనోడి చూపు అంతర్జాతీయ క్రికెట్ వైపేనని వేరే చెప్పాలా. ఒకప్పుడు సచిన్ కూడా ఇలా ఒక అమాయక బాలుడిగా అడుగుపెట్టి ప్రపంచాన్నే బ్యాటు పై నిలబెట్టాడు. ఇప్పుడు ఇక ప్రణవ్ వంతు వస్తుందేమో చూద్దాం…

(Visited 526 times, 1 visits today)