Home / Videos / ఇండియన్ మమ్మీ నా మజాకా..!?

ఇండియన్ మమ్మీ నా మజాకా..!?

Author:

అమ్మా..! ఒక పదిరూపాయలివ్వు సిగరెట్ కొనాలి” అని ఒక్క సారి మీ అమ్మ తో అని చూదండి ఏం జరుగుద్దీ…!? ఊరికే ఓ సారి ఊహించుకోండి. ఎలాఉందీ?? భీభత్సం కదా..! మరి సిగరెట్ కే అమ్మ ల రియాక్షన్ ఇలా ఉంటే ఏకంగా డ్రగ్స్ ఐతే (మా అమ్మైతే డౌట్లేకుండా బతికుండగానే పాతేస్తడి). కాస్త ఫారిన్ మమ్మీ ఐతే ఏ సైక్రియాటిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ కి తీస్కెళ్ళాలా అని ఆలో చిస్తుంది కానీ ఇండియన్ అమ్మ ఐతే అవేం ఉండవ్ కాళ్ళిరగ్గొట్టి కూచోబెట్టిమరీ ప్లేట్లో పెరుగన్నం వేస్కొచ్చి తినిపిస్తుంది.. (తల్లిప్రేమ బాబూ..!)

ఇదిగో ఓసారీన్ని చూడండి సరిగ్గా ఇదే పాయింటు. ఏదో సరదాకి డ్రగ్స్ తీస్కుంటున్నా అన్నాడు. అంతే తుక్కురేగ్గొట్టింది. ఎంత ప్రాంక్ ఐతే మాత్రం అమ్మ దగ్గరే వేశాలా..!? సచ్చిండు కొడుకు చూసి నవ్వుకోండి అంతే సరదాక్కూడా అమ్మల ముందు ఇలాంటి వేశాలెయ్యొద్దు. అసలే ఈ మధ్య అమ్మల మీద టీవీ సీరియల్ లేడీ విలన్ ల ప్రభావం ఎక్కువగా ఉంది… కొడుకని కూడా చూడకుండా కుర్చీక్కట్టేసి మరీ బాదుతారు…

(Visited 2,432 times, 1 visits today)