Home / Political / ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలంటే తప్పక ఐడీ ఫ్రూఫ్ చూపించాలి.

ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలంటే తప్పక ఐడీ ఫ్రూఫ్ చూపించాలి.

Author:

కొత్త ప్రీపెయిడ్ సిమ్ కార్డుల యాక్టివేషన్ కి ప్రభుత్వం ఎన్ని నిభంధనలు పెట్టినా టెలికాం కంపనీలు, సెల్ షాపు యజమానులు దొంగ పత్రాలతో అక్రమార్కులకు అడ్డగోలుగా సిమ్ కార్డులు అమ్మిన ఉదంతాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇలా అక్రమంగా పొందిన సిమ్ కార్డుల దుర్వినియోగం పై ఒక NGO సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ వేసింది. దీనికి స్పందించిన టెలికాం శాఖ వచ్చే సంవత్సరం నుండి ప్రీపెయిడ్ ఫోన్ లు రీఛార్జ్ చేయించుకోవాలంటె కచ్చితంగా ఎదైనా ధృవీకరణ పత్రం చూపించే విధంగా ఒక విధానాన్ని తయారు చేస్తుందని, అది వచ్చే సంవత్సరం నుండి అమలులోకి వస్తుందని  అటార్నీ జనరల్ రోహత్గి సుప్రీం కోర్టుకు తెలిపారు.

Get ID proof to recharge mobile phones

దేశంలో ప్రస్తుతం ఫోన్ వాడుతున్న వారిలో 90 శాతం మంది ప్రీపెయిడ్ సిమ్ కార్డు హోల్డర్లే. చాలా తక్కువ మంది పోస్ట్ పెయిడ్ మరియు ల్యాండ్ లైన్ కనెక్షన్ కలిగి ఉన్నారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ సిమ్ కార్డు లలో దాదపు 5.25 కోట్ల సిమ్ కార్డులు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి పొందినవే. వీటివల్ల అర్ధిక నేరాలు, వేదింపులు పెరిగే అవకాశం ఉందని లోక్ నీతి ఫౌండేషన్ సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఈ కేసుపై ప్రభుత్వ నివేదిక కోరినప్పుడు, ఇకనుండి ప్రీపెయిడ్ సిమ్ రీఛార్జ్ కోసం వినియోగదారులు షాపులో ప్రభుత్వం జారి చేసిన తమ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా చూపించేలా రూల్స్ తెస్తున్నామని, ఈ కొత్త రూల్ వచ్చే సంవత్సరం నుండి అమలులోకి వస్తుందని, దీనివల్ల ఆర్ధిక నేరాలను అడ్డుకోవడం సులువవుతుందని వాధించారు అటార్నీ జనరల్. కాని ఈ చర్య సామాన్య ప్రజలను ఓకింతా ఇద్దందికి గురి చెయ్యక తప్పదు.

Source:http://economictimes.indiatimes.com/news/economy/policy/soon-recharge-pre-paid-phones-after-proving-identity/articleshow/56996089.cms

(Visited 300 times, 1 visits today)