Home / health / మనం కొనుక్కునే పండ్ల మీద ఎప్పుడైనా స్టిక్కర్స్ ఎందుకుంటాయో గమనించారా!.

మనం కొనుక్కునే పండ్ల మీద ఎప్పుడైనా స్టిక్కర్స్ ఎందుకుంటాయో గమనించారా!.

Author:

పల్లెల్లో అయితే ఒక్కొక్క కాలంలో ఒక్కో రకం పండ్లు దొరుకుతాయి, పట్టణాలలో ఉండేవారికి ఎలాంటి పండ్లు తినాలి అన్న కొనుక్కోవలసిందే. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో మనకు పండ్ల ద్వారానే ఎక్కువ ఆరోగ్యం కలుగుతుంది. పండ్లను తరచూ తీసుకోవడం వలన మనకు సంపూరణ ఆరోగ్యం కలుగుతుంది. పల్లెల్లో అయితే చెట్టుకు తెంపుకొని తింటారు మరి పట్టణంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి?. అంటే ఎలాంటి పండ్లను కొనుక్కోవాలి తెలిసి ఉండాలి. లేదంటే మన ఆరోగ్యానికి మొదటికే మోసం వస్తుంది… మన డబ్బులు పెట్టి మరి కొంటున్నాం కాబట్టి ఎలాంటి పండ్లను కొనాలి అవి ఏ విధంగా పండిస్తున్నారు తెలుసుకోవాలి. పంట తొందరగా రావాలని చాలా మంది రసాయన ఎరువులను వాడుతున్నారు. అందుకే పండ్లను కొనే సమయంలో వాటికి ఉండే స్టిక్కర్లను ఒక్కసారి చుస్తే సరిపోతుంది.. మరి వాటిని ఎలా గుర్తుపట్టాలలో ఒకసారి చూద్దాం….

fruit-stickers

ఈ స్టిక్కర్లు బట్టి మనం ఈ పండ్లను రసాయన ఎరువులతో పండించారా! లేక సహజసిద్దంగా పండించారా! అని మనకు తెలిసిపోతుంది.

9 నంబర్ అంకెతో ఉంటే :
పండ్లపై వేసిన స్టిక్కర్ మీద అయిదు అంకెల నంబర్ ఉండి అది 9 నంబర్ తో మొదలైతే ఆ పండ్లను పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడి పండించారు అని అర్ధం. ఇలాంటి పండ్లను మనం కొనుక్కొని తినడం వలన మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి కానీ నష్టాలూ ఉండవు.

8 నంబర్ అంకెతో ఉంటే :
మన కొనుక్కునే పండ్లపై వేసిన స్టిక్కర్ పైన అయిదు అంకెల నంబర్ ఉండి అది 8 తో ప్రారంభం అయితే ఆ పండ్లు జన్యువుల మార్పిడితో పండించారని అర్ధం. ఈ పండ్లను మనం తింటే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

3 లేదా 4 నంబర్ అంకెతో ఉంటే :
మన తీసుకుంటున్న పండ్లపైనా నాలుగు అంకెల నంబర్ ఉండి ఆ నంబర్ 3 లేదా 4 తో ప్రారంభం అయితే ఆ పండ్లను కృత్రిమ రసాయనాలు, సహజసిద్ధ ఎరువులు వాడి పండించినట్టు.

(Visited 2,536 times, 1 visits today)