Home / health / తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్…!

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్…!

Author:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి. తనకు నచ్చిందే  చేస్తా అనే రకం కేసీఆర్. అలాంటి కేసీఆర్ అప్పుడప్పుడు తన చేతికి ఎముక లేనట్టుగా వరాల జల్లు కురిపిస్తాడు. ఆ మధ్య సానియా మీర్జా కు కోటి రూపాలు ప్రకటించాడు, అది కాస్తా సోషల్ మీడియాలో దుమారం లేసింది ఎందుకంటే అది రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్న సమయం. పండుగలకు పబ్బాలకు, పాటలకు ఆటలకు అన్నింటికి తనకు ఇష్టం ఉంటే ఇస్తాడు లేకుంటే లేదు.

ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది, అసలే రాష్ట్ర పండుగ కాబట్టి కచ్చితంగా పండుగను ఘనంగా నిర్వహించాలి అంటే నిధులు విడుదల చేయవలసిందే. పండుగ కోసం 15 కోట్లు విడుదల చేశారు. సంవత్సరానికి ఒక్కసారి చెప్పి వచ్చే పండుగ కోసం పైసలు ఇవ్వడంలో తప్పులేదు ఎందుకంటే ప్రజలు పండుగ రోజైన ప్రశాంతగా ఉంటారు కదా! మరి చెప్పిరాని రోగం వస్తే పరిస్థితి ఏమిటి !

telangana-arogyasri

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలలో ఆరోగ్యశ్రీ పథకం అత్యంత ప్రజాధారణని పొందింది,ఆపద సమయంలో సంజీవనిలాగ పేద ప్రజలని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంటుంది, పేద, మధ్య తరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా ఉచితంగా వైద్యం చేయించుకోగలుగుతున్నారు, అలాంటి ముఖ్యమైన ఆరోగ్యశ్రీ పథకంపై కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చాలా ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి, దాదాపు 450 కోట్ల రూపాయల బకాయిలని ప్రభుత్వం చెల్లించలేదని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకంని నిలిపివేశారు, ఈ పథకం నిలిచిపోవడం వల్ల పేద ప్రజలే ఎక్కువ నష్టపోతారు, ప్రతిసారి మిగులు బడ్జెట్ ఉంది, ధనిక రాష్ట్రము మనదే అని చెప్పే కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి మాత్రం నిధులు కేటాయించట్లేరు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకి ఉపయోగపడే ఈ పథకంపై ప్రభుత్వ పెద్దలు, కేసీఆర్ త్వరగా నిర్ణయం తీసుకొని ఆరోగ్యశ్రీ సేవలు సజావుగా జరిగేట్లుగా చేస్తే పేద ప్రజల ప్రాణాలు నిలబడతాయి.

(Visited 1,506 times, 1 visits today)