Home / Entertainment / నన్నే తిడతారా ? ఇదిగో ఇంకో ఫోటో.. ఇప్పుడేo చేస్తారు ?

నన్నే తిడతారా ? ఇదిగో ఇంకో ఫోటో.. ఇప్పుడేo చేస్తారు ?

Author:

ఒక దేశ ప్రధానిని కలిసేప్పుడు ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు అని తనని ఆడిపోసుకున్న నెటిజన్లకు బాలివుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా గట్టి సమాధానమే ఇచ్చింది. రెండు రోజుల కిందట బెర్లిన్ లో భారత ప్రధాని మోడిని కలిసిన సమయం లో ప్రియాంకా చోప్రా వేసుకున్న పొట్టి దుస్తుల పైన దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పొట్టి స్కర్ట్ వేసుకుని, కాలు మీద కాలు వేసుకొని ప్రధాని ముందు కూర్చోవడం కరెక్టు కాదని సోషల్ నెట్వర్కింగ్ లో జనాలు ప్రియాంకా చోప్రా పై తీవ్ర కామెంట్లు చేసారు. కొందరైతే సభ్యత, సంస్కారం లేవా అని ప్రియంకాపై మండిపడ్డారు. అయితే ఈ విమర్శలకు తనేం బెదిరినట్టులేదు. పైగా బెర్లిన్ లోని ఒక హోటల్ లో తన తల్లి తో కలిసి దిగిన ఇంకో ఫోటోని ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో కూడా తన కాళ్ళు కనపడేలా ఉన్న దుస్తుల్లోనే ఉంది. అంతేకాదు లెగ్స్ ఫర్ డేస్ . ఈ జీన్స్ వల్ల వచ్చిన అందం అని కింద ఒక కాప్షన్ కూడా ఇచ్చింది. అంతే కాదు, ఒక అమ్మాయి వేసుకునే దుస్తుల బట్టి ఆమెని , ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా చేయకూడదని, అయినా ఈ మోరల్ పోలిసింగ్ ఏంటి? అని తన అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది.

priyanka chopra with narendra modi-1

అయితే, దేశం పరువు తీస్తున్నావు, ఏ దేశమో మర్చిపోయావా? అయిన తమరికి ఇంత పొగ రేంటి ? అని కొంతమంది నెటిజన్లు తెగ మండిపడుతూనే ఉన్నారు. అయితే విమర్శించిన వారికి గట్టి సమాధానమే ఇచ్చావు అని మెచ్చుకుంటున్నా వాళ్ళూ ఉన్నారు. ముల్లుని ముల్లోతోనే తీసినట్టు.. తనని, తన పొట్టి దుస్తుల ఫోటోని విమర్శించినవారికి ఇంకో హాట్ ఫోటో తోనే సమాధానమిచ్చింది ప్రియాంకా చోప్రా.

(Visited 4,357 times, 1 visits today)