Home / Devotional / దేవుడికి నైవేద్యం సమర్పించే విషయంలో చేయకూడని పొరపాట్లు.

దేవుడికి నైవేద్యం సమర్పించే విషయంలో చేయకూడని పొరపాట్లు.

Author:

శృష్టికి మూలం భగవంతుడు, ఆ దైవం గర్భగుడిలో ఉన్నా లేదా ఇంట్లో నెలవై ఉన్నా ఆయనకు సమర్పించే పూజలో భాగంగా నైవేద్యం సమర్పించడం ఆనవాయితి. భగవంతునికి జరిపే ఉపచారాలలో నైవేద్యానికి ఎంతో విశిష్టత ఉంటుంది. అందుకే పురాణాల ప్రకారం తమ ఇష్టదైవానికి ఏ ఏ పదార్దాలు ప్రీతిపాత్రమో తెలుసుకొని మరీ అవి వండి నైవేద్యంగా సమర్పిస్తుంటారు భక్తులు. అయితే మంత్రాన్ని మరియు శాస్రాన్ని పాటించడంలో తప్పులు చేస్తే రావాల్సిన ఫలితానికి బదులు చాలా దుష్పరిణామాలు కలుగుతాయి అని పూరాణాలు మనకు ఘోషిస్తున్నాయి. అదే విధంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాడానికి కష్టించి నైవేద్యం తయారు చేసి వాటిని సమర్పించే విధానంలో తప్పులు చేస్తే విపత్కర ఫలితాలు వస్తాయి. అందుకే నైవేద్యం సమర్పించే సమయంలో చేయకూడని పనుల గురించి తెలుసుకొని ఇతరులకి తెలపండి.

    • దేవుడికి నైవేద్యం ఎల్లప్పుడూ బంగారం, వెండి, లేదా రాగి పాత్రలలో సమర్పించాలి అవి అందుబాటులో లేకపొతే శుభ్రమైన ఆకులో పెట్టొచ్చు అంతేకాని మళినాలతో కూడిన ప్లాస్టిక్, స్టీలు, గాజు పాత్రలలో పెట్టకూడదు.
    • దేవుడికి నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్దాలు చేసినవి చేసినట్లుగా రుచి చూడకుండా మొత్తం దైవానికి సమర్పించాలి అంతే కాని దేవుడికోసం కొంత పక్కకుపెట్టడం మంచిది కాదు. వినాయక చవితి పూజలో మీరు చూసే వుంటారు, పురోహితుడు మీరు తెచ్చిన అన్ని నైవేద్యాలను అలాగే మొత్తంగా దేవుడు ముందుంచి నైవేద్యం గా సమర్పిస్తాడు.
    • దేవుడికి నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్దాలు బాగా వేడిగా అసలు ఉండరాదు అలాగని చాలా ముందుగా తయారుచేసి చల్లారి పోయిన పదార్దాలు కూడా నైవేద్యంగా పనికిరావు. శుచిగా అప్పుడే వండించి కొంచెం వేడి తగ్గాక నైవేద్యంగా పెట్టవచ్చు.

god prasadam

  • దేవుడికి నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్దాలు ఇంట్లోనే తయారు చేసుకోవాలి, బయటి నుండి కొనుకొచ్చిన పదార్దాలు నైవేద్యంగా పెట్టకూడదు. అదే విధంగా నిలువ వున్నవి, పులిసి పోయిన పదార్దాలతో కూడ నైవేద్యం చేయకూడదు.

పైన చెప్పిన తప్పులు చేయకుండా నైవేద్యం సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

(Visited 3,406 times, 1 visits today)