Home / Entertainment / రవితేజని `ఆటోజానీ`చేస్తా – పూరి!

రవితేజని `ఆటోజానీ`చేస్తా – పూరి!

Author:

Puri Jaganath auto jhony with Ravi Teja

నాకు పూరి జగన్నాథ్ నేరేట్ చేసిన కథ సెకండాఫ్ నచ్చలేదు అంటూ చిరంజీవి తన 150 వ చిత్రం గురించి చాలా కాలం తర్వాత నోరు విప్పారు.అప్పట్లో ఆయన తెలుగులో ఓ లీడింగ్ టీవి ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఓ మూడు నెలల లోపు స్క్రిప్టుని ఫైనలైజ్ చేసి పట్టాలు ఎక్కిస్తామనే ధీమాగా ఆయన చెప్పుకొచ్చారు. కానీ చిరంజీవి, పూరి కాంబినేషన్ లో ఆటో జాని చిత్రం వస్తుందని వార్తలు వచ్చిన తర్వాత నిలిచిపోయిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు ఆ కథని పూరి రవితేజతో తీయాలనుకుంటున్నట్టు తెలిసింది. రవితేజకీ – పూరికీ మధ్య మంచి సంబంధాలున్నాయి. పూరి ఎప్పుడు తన కోసం స్క్రిప్టుని తయారు చేసినా రవితేజ వెంటనే ఓకే చెప్పేస్తుంటాడు. ఇటీవల ఇద్దరూ కలుసుకొని ఆటోజానీ గురించి మాట్లాడుకున్నారట. ఆ సినిమా చేయడానికి రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. మాస్ ఇమేజ్ ఉన్న రవితేజతో తీసినా ఆటోజానీ బాగానే బాగుంటుందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆటోజానీ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. పూరి ప్రస్తుతం ఇషాన్ అనే కొత్త కుర్రాడితో తెలుగు కన్నడ భాషల్లో ఓ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఆ చిత్రం తర్వాత ఆటోజానీనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

(Visited 239 times, 1 visits today)