Home / Entertainment / వీరికి పూరీ అంటే ఇంత క్రేజీ ఎంటీ

వీరికి పూరీ అంటే ఇంత క్రేజీ ఎంటీ

Author:

NTR and Puri Jaganath

దర్శకుడు పూరీ జగన్నాథ్ – సినిమాను ఎంత స్పీడ్ గా తిస్తుంటాడో అంతే హిట్ కొడుతుంటాడు. తను సినిమా మొదలుపెట్టే టైం లోనే సినిమా రీలీజ్ టైం చెప్పేస్తుంటాడు.చాలా రోజుల నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్‌ కు ‘టెంపర్’ ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. ఎన్టీఆర్‌ను చాలా కొత్తగా పరిచయం చేసిన క్రెడిట్ పూరీకే దక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వెంటనే మరో సినిమా రానుండడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ ఓ సినిమా చేయనున్నారన్న వార్తను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రకటన విడుదలైన మరుసటి రోజే ఎన్టీఆర్-పూరీల కాంబినేషన్‌లో అదే బ్యానర్‌లో మరో సినిమాను ప్రకటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ రామ్‌తో సినిమా అయిపోగానే, పూరీ, ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా ఉంటుందని కళ్యాణ్ రామ్ చాలాకాలంగా చెబుతూ వస్తుండగా ఆ ప్రాజెక్టుకు పూరీ దర్శకత్వం వహించనుండడం క్రేజీగా మారిపోయింది.

(Visited 120 times, 1 visits today)