Home / Videos / ‘పురచ్చి తలైవి’ జయలలిత నోట జాలువారిన ఒక చక్కని హిందీ గీతం.

‘పురచ్చి తలైవి’ జయలలిత నోట జాలువారిన ఒక చక్కని హిందీ గీతం.

అమ్మ జయలలిత చక్కని కంఠ స్వరంతో హిందీ లో పాడుతోంది..చూశారుగా ఎంత సుమధుర స్వరమో ఆమెది….ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమె ఎంత బిజీ గా ఉంటారో..రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేస్తుంటారో…..వేరే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాంటి జయలలిత చక్కని పాటని తియ్యనైన స్వరంతో పాడుతున్న వీడియో ని దర్శకుడు పూరీ జగన్నాధ్ తన ఫేస్ బుక్ పేజ్ మీద పోస్ట్ చేశాడు.

సెల్వి జె.జయలలిత ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో తమిళ, తెలుగు సినీనటిగా పేరొందారు. 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి, 1984లో తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి యం.జి.రామచంద్రన్‌ కు సన్నిహితంగా మెలిగారు. రామచందన్‌ మరణానంతరం అతని భార్య జానకి రామచందన్‌ తమిళ నాడు ముఖ్యమంత్రి అయినా ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయారు. గ్లామర్‌ వల్ల జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించారు.

1991లో రాజీవ్‌ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉన్నారు , 1996, 2006  జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందారు. 2001,2011  జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించారు, అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.

జయలలిత అసలు పేరు కోమలవల్లి. ఈమె అలనాటి సినీ నటి సంధ్య కూతురు. మైసూరులో జన్మించిన జయలలిత రాజకీయ రంగపవ్రేశానికి మునుపు తమిళ చిత్ర రంగంలో విజయవంతమైన సినీ నటి. కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతంతో తన 15వ యేట సినిమా రంగంలో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రం పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించినది. జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది.

(Visited 300 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]