Home / Inspiring Stories / పిల్లల చదువు కోసం ఒక తండ్రి పడుతున్న కష్టం…! స్పందించిన కేటీఆర్…!

పిల్లల చదువు కోసం ఒక తండ్రి పడుతున్న కష్టం…! స్పందించిన కేటీఆర్…!

Author:

పిల్లలని ఉన్నత స్థానంలో చూడాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి మరి తమ పిల్లలని చదివిస్తుంటారు, పిల్లల జీవితాలు బాగుండాలని ఎన్ని కష్టాలైనా పడుతారు, వారేమి చేసినా ఎంత క‌ష్ట‌ప‌డ్డా అది పిల్ల‌ల కోస‌మేనంటూ చిరున‌వ్వుతో చెప్పి ఆ క‌ష్టం ముఖం మీద క‌న‌ప‌డ‌కుండా కంట్రోల్ చేసుకుంటారు త‌ల్లిదండ్రులు. అలాంటి తండ్రే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హీరో అయ్యాడు. ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప‌జేస్తున్నాడు.

raffic constable works as auto driver, home guard to educate daughters

హైదరాబాద్ కి చెందిన జావేద్ ఖాన్ అనే వ్యక్తి తన కుటుంబం కోసం, పిల్లల కోసం చేస్తున్న పని అందరిని ఆలోజింపజేస్తుంది, వృత్యిరీత్యా పోలీస్ హోంగార్డ్ అయిన జావేద్ ఖాన్ పగటి పూట ఎర్రటి ఎండలో ట్రాఫిక్ విధులు నిర్వహించి, సాయంత్రం పూట ఆటో డ్రైవర్ గా మారిపోతాడు, ఇలా ఎందుకు చేస్తున్నావ‌ని అడిగితే త‌న పిల్ల‌ల‌ కోసం అంటూ చెబుతాడు జావేద్‌. త‌నకు ఆడ‌పిల్ల‌లున్నార‌ని త‌న‌కొచ్చే చాలీచాల‌ని జీతంతో వారి చ‌దువుకు ఆటంకం కలగకూడదని అని భావించి ఆటో న‌డుపుతూ అద‌నంగా సంపాదిస్తున్న‌ట్లు వివ‌రించాడు జావేద్‌. కూతుళ్ల‌ను బాగా చ‌దివించేందుకే త‌ను క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు చెప్పిన జావేద్‌… ఆ వ‌చ్చిన డ‌బ్బు పిల్ల‌ల స్కూలు ఫీజుకు, వారి ఖ‌ర్చుల‌కు స‌రిపోతుంద‌న్నాడు. సరిగ్గా చదుకోనందుకే తాను ఇప్పుడు కష్టపడుతున్నానని తనలా, తన పిల్లలు భవిష్యత్ లో కష్టపడకూడదనే బాగా చదివిస్తున్నట్టు తెలిపాడు జావేద్.

జావేద్ ఖాన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, చాలామంది జావేద్ పిల్లల చదువుకి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు, ఈ విషయం తెలుసుకొన్న మంత్రి కేటీఆర్ జావేద్ పిల్లల చదువుకి ప్రభుత్వం నుండి స్కాలర్ షిప్ లు అందజేస్తామని ట్విట్టర్ లో తెలిపారు, మస్లిజ్ ఎంపీ అసనుద్దీన్ ఒవైసి కూడా జావేద్ పిల్లలకి స్కాలర్ షిప్ వచ్చేలా చేస్తానని తెలిపారు.

(Visited 953 times, 1 visits today)