Home / Entertainment / మరో ‘దర్శకేంద్రుడు’ రాజమౌళి – రాఘవేంద్రరావు.

మరో ‘దర్శకేంద్రుడు’ రాజమౌళి – రాఘవేంద్రరావు.

Author:

SS-Rajamouli-and-K-Raghavendra-Rao

ప్రముఖ సీనియర్ హిరోలకు కానీ దర్శకులకు కాని అభిమానులు ఒక్కోక్కరికి ఒక్కో బిరుదు ఇస్తూ ఉంటారు ఆ కాలంలో ‘దర్శకరత్న’ అంటే దాసరి నారాయణరావు గారని, ‘దర్శకేంద్రుడు’ అంతే రాఘవేంద్రరావు అని అందరికి తెలిసిందే, రాఘవేంద్రరావు తన చిత్రాలతో పాటు అందులోని పాటలను కూడా ప్రత్యేక శ్రద్ధతో రకరకాల పండ్లను హీరోయిన్స్ పై వాడుతూ ఎంత అద్భుతంగా తెరకేక్కిస్తాడో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సందర్భంలో రాఘవేంద్రరావు సినిమా విడుదలవుతుంది అంటే కేవలం పాటల కోసమే వెళ్ళే అభిమానులు లేకపోలేదు. ఇక ఈ దర్శకుడికి తమ అభిమానులు ముద్దుగా ‘దర్శకేంద్రుడు’ అనే బిరుదు ఇచ్చారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఒక రోజు కార్యక్రమంలో సీ. నారాయణరెడ్డి గారు ఒక కార్యక్రమంలో నన్ను ‘దర్శకేంద్రుడు’ అని సంభోదించాడు. అప్పటి నుండి అభిమానులు కూడా అలాగే నన్ను పిలవడం మొదలుపెట్టారు. తాజాగా ఒక మీడియా సమావేశంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ తన తర్వాత ‘దర్శకేంద్రుడు’ అనే బిరుదు మాత్రం వారసత్వంగా తన ప్రియమైన శిష్యుడు ఎస్ ఎస్ రాజమౌళికి మాత్రమే దక్కుతుందని, రాజమౌళికి దర్శకేంద్రుడి బిరుదు ఇచ్చాడు. ఇక నా తర్వాత ‘దర్శకేంద్రుడు’ మాత్రం రాజమౌళి అని ప్రకటించేసాడు. అతనికి మాత్రమే ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో అది సరిపోతుందని తెలిపాడు.

(Visited 102 times, 1 visits today)