Home / Inspiring Stories / రాజం గారి వాకిట్లో ‘ అల్లం ’ చెట్టు!

రాజం గారి వాకిట్లో ‘ అల్లం ’ చెట్టు!

Author:

భూమి గుండ్రంగా ఉండటం అంటే ఇదే కాబోలు….అల్లం నారాయణ గారు మళ్ళీ సి ఎల్ రాజం  గారి గూటికి చేరబోతున్నారట! అలా అని జూబ్లీహిల్స్ సంపాదక వర్గాలు కోడై కూస్తున్నాయి. తెలంగాణ అక్షరానికి సాధికారికతను తీసుకొచ్చిన అల్లం నారాయణ ను తన బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుందామని ..నమస్తే తెలంగాణా దినపత్రిక వ్యవస్థాపక ఛైర్మన్ సి ఎల్ రాజం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారనీ, అందులో భాగంగానే ఇటీవల అల్లం నారాయణ తో సంప్రదింపులు జరిపారనీ వార్త! రాష్ట్ర విభజన తర్వాత …అందునా తెలంగాణా ముఖ్యమంత్రిగా కె సీ ఆర్ ప్రమాణ స్వీకార సమయంలో….వచ్చిన అభిప్రాయ బేధాల కా రణంగా..రాజం..కె సీ ఆర్ దారులు వేరయ్యాయి. ఫలితంగా రాజం గారు అనివార్యమైన పరిస్థితులలో తన ప్రియ పత్రిక నమస్తే తెలంగాణాను కె సీ ఆర్ కు ఒప్పచెప్పారు. ఆ వెంటనే  బీజేపీలో చేరిపోయారు.

అయితే, నడి మధ్యన కొన్నాళ్లు కె సీ ఆర్ కు రాజం దగ్గరయ్యారనే వార్తలు కూడా వచ్చాయి…నమస్తే తెలంగాణా పత్రికను ఒప్పచెపితే, రాజ్యసభ సీటు ఇస్తాననే హామీ ఆయన ఇంట్లో భోజనం చేసి మరీ ..కె సీ ఆర్ ఇచ్చి వెళ్లారనీ కూడా ప్రచారం నడిచింది. ఏమైందో ఏమో కానీ …కె సీ ఆర్ వ్యవహార శైలితో మనస్తాపం చెందిన రాజం గారు..తిరిగి ఢిల్లీ బే జీ పీ బాసులకు దగ్గర కావటం మొదలెట్టారు. బార్టర్ సిస్టమ్ ను బలంగా నమ్మి ఆచరించే రాజం బలాబలాల పట్ల స్పష్టమైన అవగాహన కు వచ్చిన అమిత్ షా ..రాజం దగ్గర ఇటీవల చేసిన కొత్త తెలుగు దినపత్రిక ప్రపోజల్ కు రాజం సమ్మతించారనీ, భవిష్యత్తులో ఏర్పడబోయే రాజ్యసభ ఖాళీలలో ఎక్కడో ఒక చోట నుంచి రాజం గారికి అవకాశం కల్పిస్తామనీ అమిత్ షా హామీ ఇచ్చారనిన్నీ జూబ్లీహిల్స్ సంపాదక వర్గాల్లోనూ, సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లోనూ హాట్ డిస్కషన్ నడుస్తోంది. అందులో భాగంగానే భారీ పెట్టుబడితో వచ్చే తెలుగు పత్రికకు..తన ఫేవరెట్ ఎడిటర్ అల్లం నారాయణ ను సారధ్యం వహించమని రాజం కోరారట! అందుకు, నారాయణ సమ్మతించారట!

అయితే….పదవి రీత్యా ప్రతిష్టాత్మకమైన ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ షిప్ ను అల్లం నారాయణ ఎందుకు వదిలేస్తారనే వాదనా లేకపోలేదు…కానీ…ఆయన అక్కడ సఫోకేషన్ భరించలేకపోతున్నట్టు సమాచారం. స్వేచ్చాభావజాలానికి కేరాఫ్ అడ్రెస్ అయిన అల్లం నారాయణ స్వతంత్ర వ్యవహారశైలి సేక్రెటేరియట్ లోని సి ఏం బ్లాక్ అధికార గణానికి నచ్చకపోవటం తో నారాయణ కూడా ..అంత కంఫర్టబుల్ లా లేరని తెలుస్తోంది.

ఒక వేళ అల్లం నారాయణ ప్రెస్ అకాడెమీ కి గుడ్ బై చెపితే, తక్షణం ఆయనను తన కమాండర్ గా నియమించుకోవటానికి రాజం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారని సమాచారం. కానీ, బీ జె పీ మద్దతు తో వచ్చే ఈ పత్రిక—తెలంగాణ కు పరిమితమవుతుందా? లేక, ఆంధ్రా ప్రాంతానికి కూడా విస్తరిస్తుందా అనే దాని మీద మాత్రం ఇంకా సి ఎల్ రాజం కే క్లారిటీ లేనట్టు సమాచారం. ఏదైతేనేం…..తెలంగాణా నుంచి తొలి బ్రాండెడ్ పత్రికను తీసుకొచ్చిన రాజం..సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా స్ట్రాటెజిక్ గానే ఆడగలరనే నమ్మకాన్ని కొందరు సీనియర్ పాత్రికేయులు వ్యక్తం చేస్తున్నారు.

(Visited 103 times, 1 visits today)