Home / Entertainment / Video: బరిలోకి దిగిన రాజమౌళి – సుకుమార్..!

Video: బరిలోకి దిగిన రాజమౌళి – సుకుమార్..!

Author:

బాహుబలి సినిమాతో దేశం మొత్తం దృష్టి టాలీవుడ్ పై పడేలా చేసిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరున్న సుకుమార్ ఈమధ్య ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగిన ఎస్.ఎస్.రాజమౌళి 11 అండ్ సుకుమార్ 11 జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఇద్దరు దర్శకులు తమ వాళ్ల సినిమాల్లోని నటులతో పాటు టెక్నీషియన్స్ ను కూడా జట్టులోకి తీసుకుని గ్రౌండ్ లోకి దిగారు. క్రికెట్ మ్యాచ్ గెలవడం కోసం ఇరు జట్ల సభ్యులు వీలైనంత నెట్ ప్రాక్టీస్ చేసి మరీ బరిలోకి దిగారు. టాస్ వేయడం పూర్తయ్యాక రాజమౌళి టీంకు బ్యాటింగ్ చేసే ఛాన్సొచ్చింది. మన టీం బ్యాటింగ్ చేయాలంటూ రాజమౌళి అందరికీ చెప్పడం వరకు మాత్రమే టీజర్ లో ఉంచారు. ఈ వీడియోని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

సుకుమార్

మరి రెండు టీంలలో ఎవరెవరు ఉన్నారు.. ఎవరు ఎంత స్కోర్ చేశారు..? ఎవరు గెలిచారు.? అనేది తరవాత తెలియజేస్తారన్నమాట. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ హీరోగా రంగస్థలం-1985 మూవీ తీస్తున్నాడు. పీరియాడికల్ ఫిలిం కావడంతో దీనిపై బజ్ బాగానే క్రియేటయింది. క్రికెట్ మ్యాచ్ టీజర్ సంగతి సరే.. రంగస్థలం మూవీ టీజర్ ఎప్పుడు దించుతారంటూ టీజర్ చూసిన నెటిజన్లలో కొంతమంది ప్రశ్నలు సంధిస్తున్నారు. సుకుమార్ వాటికి రెస్పాన్స్ ఎప్పుడిస్తాడో మరి?

(Visited 184 times, 1 visits today)