Home / Entertainment / ‘గరుడ’ పై క్లారిటీ ఇచ్చిన దర్శకధీరుడు.

‘గరుడ’ పై క్లారిటీ ఇచ్చిన దర్శకధీరుడు.

Author:

rajamouli about Garuda cinema

తెలుగు చలన చరిత్రలో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ లో నెంబర్ 1 డైరెక్టర్, మరియు ఇప్పటి వరకూ ఫ్లాప్స్ లేని డైరెక్టర్ ఎవరంటే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్తారు. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ యువ దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత. హీరో లతోనే కాదు ఈగ తో కూడా సినిమా తీసి హిట్ ఇవ్వగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. దాని తర్వాత దాదాపు రెండున్నరేళ్ళు కష్టపడి భారి విజువల్ వండర్ గా తీసిన బాహుబలి సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి, కలెక్షన్స్ తో రికార్డ్స్ బద్దలు కొట్టింది. రాజమౌళి మరో ఏడాదిన్నర పాటు బాహుబలి రెండవ పార్ట్ పై కూర్చోనున్నారు. ఇటీవలే సెకండ్ పార్ట్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టారు.

రాజమౌళి తన తదుపరి సినిమా ‘గరుడ’ అనే వార్తలు వస్తున్నాయి. ఇదే ప్రశ్నని ఆయన ముందు ఉంచినప్పుడు ‘అవును గరుడ అనే సినిమా ఉంది, ఉంటుంది. కానీ ఇప్పుడు దాని గురించి చెప్పలేను. ఎందుకంటే ఆ గరుడకి సంబందించిన స్టొరీ లైన్ మాత్రమే నా దగ్గర ఉంది. దాన్ని ఇంకా పూర్తి కథగా తయారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం నా దృష్టంతా బాహుబలి 2 పైనే అని’ రాజమౌళి తెలిపాడు. దీంతో గరుడ అనే సినిమాపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు.

(Visited 203 times, 1 visits today)