Home / Entertainment / రాజమౌళి ‘గరుడ’ ఎన్టీఆర్ కోసమేన !?

రాజమౌళి ‘గరుడ’ ఎన్టీఆర్ కోసమేన !?

Author:

రాజమౌళి తెలుగు చలన చరిత్రలో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ లో నెంబర్ 1 డైరెక్టర్. ఇప్పటి వరకూ ఫ్లాప్స్ లేని దర్శకధీరుడు. ఒక్క పరాజయం కూడా చవిచూడకుండ వరుసగా 10 సినిమాలు తెలుగు పరిశ్రమకు అందిచాడు. హీరోలతోనే కాదు ఈగ తో కూడా సినిమా తీసి హిట్ ఇవ్వగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలి సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి, కలెక్షన్స్ తో రికార్డ్స్ బద్దలు కొట్టింది. రాజమౌళి మరో ఏడాదిన్నర పాటు బాహుబలి రెండవ పార్ట్ పై కూర్చోనున్నారు. ఇటీవలే సెకండ్ పార్ట్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టారు. రాజమౌళి తన తదుపరి సినిమా ‘గరుడ’ అనే వార్తలు వస్తున్నాయి. ఇదే ప్రశ్నని ఆయన ముందు ఉంచినప్పుడు అవును ‘గరుడ’ అనే సినిమా ఉంది అని అన్నారు. రాజమౌళి ‘బాహుబలి-2′ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. గరుడ సినిమా పౌరనికం కావడం వలన ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేయాలని అనుకుంటున్నాడట రాజమౌళి.ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజిగా ఉన్న విషయం తెలిసిందే, అలాగే రాజమౌళీ కూడా బాహుబలి2 తో బిజిగా ఉన్నాడు. అయితే ఈ సినిమా భారీ ప్రాజెక్టు కావడం, బాహుబలి సినిమాను మించిన బడ్జెట్ తో చేసే ఇంటర్నేషనల్ ప్రాజెక్టు కావడంతో దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ ఉంటుందని, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శారీరకంగా ప్రత్యేకంగా సన్నద్దం అవ్వాల్సి ఉంటుందని, రెండు మూడేళ్ల పాటు ఇతర సినిమాలు చేయకుండా కేవలం ఇదే ప్రాజెక్టుకు పరిమితం కావాలని చెప్పాడట రాజమౌళి. రాజమౌళిపై నమ్మకంతో ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేసిట్లు చెబుతున్నారు ఫిలిం నగర్ వాసులు. ఈ ఇద్దరు కలసి మరి యెన్ని రికార్డ్ లు తిరుగా రాస్తారో చూడాలి మరి.

(Visited 966 times, 1 visits today)