Home / Entertainment / తమిళ కొత్త సంవత్సరం కనుకగా కబాలి టీజర్

తమిళ కొత్త సంవత్సరం కనుకగా కబాలి టీజర్

Author:

Kabali-teaser on 14th april

        సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, రియలిస్టిక్ సినిమాలతో తమిళనాట సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా.రంజిత్ తెరకెక్కిస్తోన్న గ్యాంగ్‌స్టర్ సినిమా ‘కబాలి’. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ‘కబాలి’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

        ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో అంతటా విపరీతమైన అంచనాలు రేకెత్తించిన కబాలి సినిమా టీజర్ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీజర్ ఇప్పుడు రిలీజ్, అప్పుడు రిలీజ్ అంటూ చాలా ప్రచారాలే బయలుదేరాయి. కొద్దిరోజుల క్రితం ఈ ప్రచారాలన్నింటికీ స్వస్తి పలికేలా నిర్మాత కళైపులి థాను ఏప్రిల్ నెలలో టీజర్ విడుదలవుతుందని ప్రకటించేశారు. తాజాగా ఏప్రిల్ నెలలో తమిళ కొత్త సంవత్సర (ఏప్రిల్ 14న) కానుకగా టీజర్ విడుదలవుతుందని నిర్మాత స్పష్టం చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాధికా ఆప్టే నటిస్తుంది మరియు సంగీతం సంతోష్  నారాయణ్ అందిస్తున్నాడు.

(Visited 109 times, 1 visits today)