Home / Entertainment / కలెక్షన్స్ లేక చతికిలపడుతున్న బ్రూస్లీ. 

కలెక్షన్స్ లేక చతికిలపడుతున్న బ్రూస్లీ. 

Author:
Ram Charan Bruce lee Movie Collections
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఎంత హడావిడి చేసిన బ్రూస్లీ సినిమాకి ప్రేక్షకులు కరువయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్చరన్ మరియు శ్రీను వైట్ల సారధ్యంలో వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులని తప్ప సామాన్య ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సీన్స్ ఉన్నా కూడా సినిమా అనుకున్న కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. రామ్చరన్ మరియు రకుల్ నటనకి మంచి గుర్తింపు వచ్చిన కూడా మూస కథ, ఆకట్టుకొని కామెడీ మరియు థమన్ రిపీటెడ్ మ్యూజిక్ వీక్ డేస్లో ప్రేక్షకులని సినిమా కి రాకుండా చేశాయి.
 55 కోట్లకి అమ్ముడుపోయిన ఈ సినిమా ఇప్పటికీ 40 కోట్లు షేర్ కూడా వసులుచేయలేక బయ్యర్స్ కి భారీ కష్టాలని, నష్టాలని మిగిల్చింది. ఇందులో శ్రీను వైట్ల వైఫల్యంకొట్టొచ్చినట్లు కనపడుతుంది. మంచి క్రూ మరియు క్యాస్టింగ్ దొరికినప్పుడు మంచి కథతో రాకుండా మళ్లీ తన పాతచింతకాయ కథనె తిప్పి తీసి అందరికి నష్టాలు మిగిల్చాడు. దీని ద్వార సినిమా డైరెక్టర్స్ తెలుసుకోవాల్సింది విషయం ఒక్కటే. సినిమాకి కథే బలం మరియు తెలుగు ప్రేక్షకులు మంచి కథలని ఎప్పుడు ఆదరిస్తారు.
(Visited 75 times, 1 visits today)