Home / Entertainment / రాం చరణ్ ఇలా చేస్తాడనుకోలేదు.

రాం చరణ్ ఇలా చేస్తాడనుకోలేదు.

Author:

ఈ సంవత్సరం దసరా రేసు లో నిలవబోతున్న సినిమాల్లో మొదటగా వినిపించే పేరు బ్రూస్ లీ. చరణ్ ఫైట్ మాస్టర్ గా కనిపించే ఈ సినిమా పై అంతా ఆసక్తి గానే ఉన్నారు. మెగాస్టార్ తో బాటు నాగార్జున ఇంకా మరికొందరు హీరోలు రియల్ లైఫ్ క్యారెక్టర్లలో కనిపించ బోతున్నారు అనే ప్రచారం ఒక ఎత్తైతే చెర్రీ బబాయ్ ని కూడా రంగం లోకి దించాడనే వార్త ఒకెత్తు. పవన్ చెర్రీ తో కలిసి తెరమీద కనిపిస్తే ఇక మెగా అభిమాను లకి పండగే… “వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!” అన్న చెర్రీ డైలాగ్ ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో పాపులర్ ఐపోయింది.  . ఇప్పటికే బ్రూస్ లీ కథ ఇదే నంటూ ఒక కథ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ (బ్రూస్ లీ) ఒక స్టంట్ మాస్టర్ గా దర్శనమిస్తాడని మనకు ముందే తెలుసు.కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది వాస్తవానికి చెరణ్ ఒక సీక్రెట్ పోలీస్. తన అక్క (కృతి ఖర్బంద) అనుకోకుండా కొందరు గుండాల చేతుల్లో మరణిస్తుంది. అయితే ఆమె మరణం మామూలుది కాదనీ దాని వెనుక ఉన్న కారణాలని వెతకటం మొదలు పెట్తిన చరణ్ దీని వెనుక ఒక పెద్ద డాన్ ఉన్నాడని తెలుసుకుంటాడు. దీంతో వారిపై యుద్దం మొదలు పెట్టిన బ్రూస్ లీ ఇక ఆ డాన్ కు సంబంధించి సామ్రాజ్యాన్ని అంచలంచెలుగా పడగొడుతూ డాన్ ని అంతం చేస్తాడట..

ఇదిలా ఉండగా మొన్న జరిగిన ఆడియో ఫంక్షన్ లో రాం చరణ్ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో చూసిన తన కు ఆశ్చర్యం గర్వం కలిగాయని చెప్పిన చిరు మాటలు నిజమే అనిపించేలా ఈ సినిమా రచయితల్లో ఒకరైన కోనా వెంకట్ ఇప్పుడే ఫేస్ బుక్ లో ఒక స్టేటస్ అప్ డేట్ చేసారు. బ్రూస్ లీ సినిమాలో ఆఖరి పాట షూటింగ్ కోసం రాత్రంతా నిద్రలేకుండా శ్రమపడ్డాడట. చెర్రీ కి ఉన్న సీరియస్ నెస్ కి ఈ సూపర్ రైటర్ ఫ్లాటైనట్టున్నారు.”సినిమా పట్ల చరణ్ కమిట్ మెంట్ ని చూసి ఆశ్చర్య పోయాను. బ్రూస్ లీ లో చివరి పాట షూటింగ్ కోసం రాత్రంతా ఉదయం 6:30 వరకూ నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తూనే ఉన్నాడు.అతనితో సమానం గా మా అందాల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బ్రూస్ లీ కోసం చాలా కష్ట పడింది. ఉదయం వరకూ రాం చరణ్ తో పోటా పోటీగా డాన్స్ చేస్తూనే ఉంది.” అంటూ తన ఫేస్ బుక్ వాల్ మీద. చెర్రీ కి తన పని మీద ఎంత డెడికేషన్ ఉందో తను చేసే పని పట్ల ఎంత నిబద్దతతో ఉంటాడో చెప్పారు. కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడూ ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ చెర్రీ .

(Visited 63 times, 1 visits today)