Home / Entertainment / మెగా అభిమానులకు తీపికబురు.

మెగా అభిమానులకు తీపికబురు.

Author:

వరుస సినిమాల పరాజయాలతో సతమతమౌతున్న మెగా హీరో రామ్ చరణ్. ఈ మెగా పవర్ స్టార్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘దృవ’. ఈ సినిమా ట్రైలర్ విడుదలై తన ముందు సినిమాలా పరాజయాన్ని మరపించేలా బ్రహ్మాడమైన ఆదరణ పొందింది. తక్కువ రోజులలో 3 మిలియన్ల మార్క్ దాటింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న పాటల వేడుకకు, ఆరోజు విడుదలయ్యే మరో ట్రైలర్ కోసం మెగా అభిమానులు ఎదుచూస్తున్నారు.ఇక అలా ఎదురు చూస్తున్న అభిమానులకు ఎండ కాలంలో చల్లటి వర్షంలా మీకో వార్తా.

ram-charan-invited-pawan-kalyan-for-dhruva-audio-launch

ఆ వార్తా ఏమిటంటే వచ్చే నెల నంవబర్ 20 న ఈ చిత్ర ఆడియో రిలీజ్ జరుగనుంది. ఈ పాటల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వస్తారనే న్యూస్ వినిపిస్తుంది. పవర్ స్టార్ వచ్చే విషయం మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎవరు ప్రకటించలేదు. ఒకవేళ పవర్ స్టార్ వస్తే చాలా రోజుల తర్వాత అభిమానులకు మెగా హీరోలందరిని ఒకే వేదికపై చూసే ఛాన్స్ దక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలనాటి అందాల రాకుమారుడు అరవింద స్వామి విలన్ గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదల కానుంది.

(Visited 271 times, 1 visits today)