Home / Latest Alajadi / వైరల్ అవుతున్న ఆగడు స్పూఫ్ వీడియో..! మహేష్ బాబు ప్లేస్ లో కేసీఆర్.! షేర్ చేసిన ఆర్జీవి

వైరల్ అవుతున్న ఆగడు స్పూఫ్ వీడియో..! మహేష్ బాబు ప్లేస్ లో కేసీఆర్.! షేర్ చేసిన ఆర్జీవి

Author:

కేసీఆర్‌ దూకుడు ముందు ప్రతిపక్షాలు కకావికలమైపోయాయి. కూటమి అంటూ నేతలు కలిసినా…ప్రజలు మాత్రం కలవలేదు. చివరికి కూటమికి ఓటమి తప్పలేదు. సరైన వ్యూహం లేకుండా ఎన్నికల్లోకి వెళ్లడం కూడా కూటమి వైఫల్యానికి కారణమైంది. బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న కాంగ్రెస్‌, తెదేపాల మధ్య ఓట్ల బదలాయింపులో ఉన్న లోపాలను ఈ ఫలితాలు బయటపెట్టాయి.

ఇక తెలంగాణ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో ఆ ప్రభావం కచ్చితంగా ఏపీలో చూపిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. బయట గెలవలేకపోయిన చంద్రబాబు ఇంట అయినా గెలుస్తారా అనే వాదనలు వినపడుతున్నాయి. ఇది ఇలా ఉండగా…సోషల్ మీడియాలో ఎప్పుడు కాంట్రోవర్సిస్ కి గురయ్యే రామ్ గోపాల్ వర్మ తాజాగా ఈ ఎన్నికలపై ఓ పోస్ట్ చేసారు. ఆగడు స్పూఫ్ వీడియో ని వర్మ చేయగా ఎంతోమంది లైకులు షేర్లు కొట్టారు. ఆ వీడియో మీరు ఒక లుక్ వేయండి.

watch video:

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఏకపక్ష విజయాన్ని హైలైట్ చేసేలా వర్మ మహేష్ బాబు చిత్రం ఆగడు స్పూఫ్ వీడియోని పోస్ట్ చేశాడు. మహేష్ బాబు ముఖానికి కేసీఆర్ మాస్క్ తగిలించి విలన్ల ముఖాలకు చంద్రబాబు, లోకేష్, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం ఇలా మహా కూటమి నాయకుల మాస్క్ లు తగిలించారు. తెలంగాణ ఎన్నికల్లో వీరందరిని సింగిల్ హ్యాండ్ తో చిత్తు చేసిన వైనాన్ని చూపించారు.

(Visited 1 times, 1 visits today)