Home / Entertainment / మాఫియాతో,మహిళలతో సంబంధాలు ఉన్నాయి.

మాఫియాతో,మహిళలతో సంబంధాలు ఉన్నాయి.

Author:

Ram Gopal Varma Book Guns and Thighs

అమితాబ్ బచ్చన్ ను ఇడియట్ అని తిట్టిన, మాఫియాతో సంబంధాలు ఇలాంటి వ్యవహరాలు అన్ని వర్మ తన ఆత్మకథ ‘గన్స్ అండ్ థైస్’ పుస్తకం లో చూడవచ్చు అంటున్నాడు.సాధారణంగా వర్మను ఎవరైనా మీకున్న మాఫియా సంబంధాలు అలాగే వ్యక్తిగతంగా మహిళలతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నిస్తే సింపుల్ గా ‘నో కామెంట్’ అని చెప్తారు. నిజంగా వర్మకు మాఫియాతో, మహిళలతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలియదు గాని ఆయన ఇచ్చే ఇలాంటి సమాధానాల వల్ల అవి నిజమేనేమో అనుమానాలు మాత్రం జనంలో బలపడుతాయి. అంతలా తన మాటలతో మాయ చేయగలరు వర్మ ‘నా ఇష్టం..’ ‘వోడ్కా విత్ వర్మ..’ ఇవి రెండు రామ్ గోపాల్ వర్మ రాసిన పుస్తకాలు. మనోడు పబ్లిక్ లో ఫాలోయింగ్ కోసం ఎలంటి విషయనైన తనకు అనుకువగా మర్చుకుంటు ఫేస్ బుక్,ట్విట్టర్ లో పెట్టడం అలవాటు .ఇప్పుడు మళ్ళి ‘గన్స్ అండ్ థైస్’ అంటున్నాడు. ఇందులో ఇంతవరకు వర్మ గురించి ఎక్కడా చదవని, వినని అంశాలను వర్మ ప్రస్తావించారట. అయితే రామ్ గోపాల్ వర్మ మరికొన్ని రోజుల్లో మరో సంచలనానికి తెరలేపబోతున్నారు. వర్మ తన ఆత్మకథ ‘గన్స్ అండ్ థైస్’ పుస్తకాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. రూపా పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం మార్కెట్ లో విడుదలవబోతుంది. సంచలనాలకు మారుపేరైన వర్మ ఈ పుస్తకం విడుదలతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో!

(Visited 138 times, 1 visits today)