Home / Videos / రెండో సారి ఎటాక్ చేసిన వర్మ..!

రెండో సారి ఎటాక్ చేసిన వర్మ..!

రాం గోపాల్ వర్మ మరో క్రైం స్టోరీని తెర మీదికి తెస్తున్నాడు. ఎటాక్ పేరుతో వస్తున్న ఈ సినిమాలో కూడా ప్రేక్షకుడి మీద చల్లటానికి కావలసినంత రక్తాన్ని తెచ్చాడు. ఎప్పటి మాదిరే తన టైప్ ఆఫ్ మేకింగ్ లో తీసిన సినిమా “ఎటాక్” రెండో ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. రాం గోపాల్ వర్మ మార్క్ లో కనిపించే ఫ్రేమింగ్ తో వచ్చిన ఈ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే శ్లోకాలు తప్ప డైలాగ్ లు మాత్రం నేమీ అర్థం కావటం లేదు. జీకే ఎంటర్టైన్మెంట్ పతాకం పై సీ.కళ్యాన్ నిర్మిస్తున్న ఈ సినిమా లో హీరోగా మంచు మనోజ్ నటిస్తుండగా మరో పవర్ ఫుల్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు.

“చెడ్డవాడిని మంచితనంతో క్షమించి వదిలేయటం మహా పాపం” అంటూ వచ్చిన మొదటి ట్రైలర్ చూడగానే ఇది హైదరాబాద్ బ్యాక్ ద్రాప్ లో సాగే కథ అన్న విషయం అర్థం ఐపోతోంది.  హై ఇంటెన్సిటి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న తన తాజా చిత్రంలోని ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం తెలుగు చలన చరిత్రలో ఇంతవరకూ ఎవరూ షూట్ చెయ్యని విధంగా.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పురానాపూల్  ఏరియాల్లో షూటింగ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తే  మళ్ళీ రక్త చరిత్ర లాగే మరొక సంచలనానికి తెర లేపాడనిపిస్తుంది. వర్మ బ్రాండ్ అయిన కొత్త కెమెరా యాంగిల్స్ , క్రైమ్ , రి రికార్డింగ్ , పొదుపైన సూటిగా వుండే మాటలు అన్నీ వర్మ పాత సినిమాలను గుర్తుకు తెస్తున్నాయి. వర్మ ఈజ్ బ్యాక్ అందరూ అంటున్నారు… అది నిజమో …? కాదో …? సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఓపిక పట్టాలి మరి.

(Visited 27 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]