Home / Entertainment / రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్..!?

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్..!?

Author:

Pawan Kalyan Movie with Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మ , పవన్ కళ్యాణ్ కలిసి సినిమా తీస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు కొన్ని రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది, కొన్ని రోజుల క్రితం దర్శకరత్న దాసరి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అంటూ ఒక వార్త హల్ చల్ చేసింది, ఆ తరువాత సంపత్ నంది, డాన్స్ మాస్టర్ జానీల పేర్లు వినిపించాయి, కాని అవేవి సెట్ కాలేదు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో చాల బిజీగా ఉన్నాడు, ఆ సినిమా అయిపోయాక ఒక నిర్ణయానికి వచ్చే ఆవకాశం ఉంది, కాని ఇంతలోనే పవన్ కళ్యాణ్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నటించబోతున్నాడు అనే వార్త వచ్చింది. రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమా తీసి చాల రోజుల తరువాత విజయాన్ని అందుకున్నాడు, త్వరలో విజయవాడ కేంద్రంగా జరిగిన సంఘటనలతో వంగావీటి అనే సినిమాను తీయబోతున్నట్టు ప్రకటించాడు, రక్త చరిత్ర, కిల్లింగ్ వీరప్పన్ లాంటి జీవిత చరిత్రలతో మంచి విజయాలను వర్మ అందుకున్నాడు.

వంగవీటి సినిమాలో చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది, దాసరి నిర్మాణం పవన్ చేయబోయే సినిమా అదేనంటు మాట్లాడుకుంటున్నారు, కాని ఈ వార్తలన్నీ గాలి వార్తలే ఎందుకంటే విజయవాడ నేపథ్యంలో సినిమా అంటే కచ్చితంగా కులాల ప్రస్తావన ఉంటుంది,అందులోనూ వర్మ ఎక్కువగా ఉన్నదీ ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి అలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ నటించే ఆవకాశాలు చాల తక్కువ, అదే కాకుండా ఒక సందర్భంలో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేనని చెప్పాడు, కావున ఇలాంటి గాలి వార్తలని నమ్మి ఫాన్స్ అయోమయానికి గురికావద్దని కొంత మంది సినీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.

(Visited 633 times, 1 visits today)