Home / Reviews / శివమ్ సినిమా రివ్యూ.

శివమ్ సినిమా రివ్యూ.

Shivam Movie review శివమ్ సినిమా రివ్యూ

Alajadi Rating

2.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: రామ్,రాశి ఖన్నా, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి

Directed by: శ్రీనివాస్ రెడ్డి,

Produced by: స్రవంతి రవి కిషోర్

Banner: శ్రీ స్రవంతి మూవీస్

Music Composed by: దేవి శ్రీ ప్రసాద్

కొంత కాలం గా సరైన విజయం లేక ఒక్క స‌క్సెస్ అంటూ బాక్సాఫీస్ పైకి గ‌జినీలా దండ‌యాత్ర చేస్తూనే ఉన్నాడు కుర్ర హీరో రామ్.కథని ఎంచుకోవటంలోనూ సరైన పాత్రల ఎంపిక లోనూ రామ్ టేస్ట్ కాస్త పూర్ అనే అనిపించింది ఈ నాలుగేళ్ళలో,మ‌రి శివ‌మ్ తో నైనా రామ్ కి హిట్ వస్తుందా..? మళ్ళీ కొత్త జోష్ తో గంతులేస్తాడా అన్నది ఈ సాయంత్రానికి తేలుతుంది..

కథ:

ప్రేమ కోసం ఏదైనా చేసే కుర్రాడు శివ‌మ్(రామ్) ప్రేమించుకున్న లవర్స్ కి పెళ్ళిళ్ళు చేస్తూంటాడు.పెద్దలు ఒప్పుకోకుంటే ఫైటింగు లు చేసి మరీ పెళ్ళి చేస్తాడు.మరి ఇందరి ప్రేమికులను కలిపిన ఈ కుర్రాడికి ఒకరోజున త‌నూజ(రాశీఖ‌న్నా) ఐ ల‌వ్ యూ అంటూ ఎదురుప‌డుతుంది. పాపని ఫాలో ఔతూ డ్రీం లో ఉన్న మనోడు అనుకోకుండా జడ్చర్ల లో ఉన్ డే బడా దాదా బోజిరెడ్డి(వినీత్ కుమార్) కొడుకుల‌తో గొడ‌వ పెట్టుకుంటాడు శివ‌మ్. దాంతో బోజి రెడ్డి మనుషులు శివాని చంపాలని వెతుకుతూ ఉంటారు. అదే టైంలో హైదరాబాద్ లో దందాలు చేసే అభి(అభిమన్యు సింగ్) కూడా శివ కోసం వెతుకుతూ ఉంటాడు. శివ ప్రేమని తను ఓకే చేసే టైంకి శివాని బోజి రెడ్డి మనుషులు, తనుని అభి మనుషులు తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే శివ కోసం వచ్చిన అభి మనుషులు తనుని ఎందుకు తీసుకెళ్ళారు.? బోజి రెడ్డి మనుషుల నుంచి శివ ఎలా తప్పించుకుకొని తన ప్రేమను, తనుని కాపాడుకున్నాడు అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిందే..

అలజడి విశ్లేషణ:

శివ‌మ్మరీ కొత్త కథేం కాదు. ఇప్ప‌టికే చాలా సార్లు చూసి చూసి అరిగిపోయిన కథే ఇది. హీరో ప్రేమికులకి సప్పోర్ట్ గా ఉండి పెళ్ళిల్లు చేయటం. హీరోయిన్ ను చూసిన తొలి చూపులోనే హీరో ప్రేమ‌లో ప‌డ‌టం. వెంటనే ఆమె వెనక పడి వెళ్ళిపోవటం, త‌ర్వాత ఆమె ప్రేమ కోసం ఏదైనా చేయ‌డం. మ‌ధ్య‌లో వ‌చ్చిన విల‌న్స్ ను త‌న ప్రేమ‌లో బ‌క‌రాల‌ను చేసి ఆడుకోవ‌డం.. ఇదే ఫార్ములా తో గ‌త ప‌దేళ్లుగా కుప్పలు తెప్పలు గా సినిమాలు వచ్చాయ్. రాం రేడీ కూడా కొంతవరకూ ఇదే స్టైల్ లో సాగుతుంది. ఫ‌స్టాఫ్ మొత్తం హీరో కారెక్ట‌రైజేష‌న్.. హీరోయిన్ తో ల‌వ్ ట్రాక్, కొన్ని కామెడీ సీన్లు, కాస్ట మసాలా కోసం విల‌న్ ల‌తో చిన్న గొడ‌వ‌లు. ఇలాగే సాగిపోతుంది. బ్ర‌హ్మానందంకు భ‌యాన్ని ప‌రిచ‌యం చేసే సీన్. పోసాని ఇంట్రడక్షన్ సీన్ లు పిచ్చి పిచ్చిగా నవ్విస్తాయి.ఎలాంటి ట్విస్ట్ లేకుండా ఫ‌స్టాఫ్ ను ముగించేసిన ద‌ర్శ‌కుడు.. సెకండాఫ్ లోనైనా అస‌లు క‌థ‌లో కూడా పెద్ద‌గా ట్విస్టులు లేకుండానే బండి  హీరోయిన్ ను విల‌న్ల చెర నుంచి చిన్న స్కెచ్ వేసి త‌ప్పించ‌డం.అక్కనుంచి వెళ్ళి అందమైన లొకేషన్లలో పాటలు పాడుకోవటం కోసం వెళ్లటం. మ‌ధ్య‌లో స‌ప్త‌గిరితో కామెడీ చేస్తూ మెళ్ళగా కథని చివరికి లాక్కొచ్చాడు. అస‌లు ప్రేమ కోసం హీరో ఎందుకు అంత క‌ష్ట‌ప‌డ‌తాడు ఎందుకలా అందరి పెళ్ళిళ్ళు చేస్తాడు అనే దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. సినిమా లెంగ్త్ 2 గంట‌ల 50 నిమిషాలు ఉండ‌టంతో క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది. చివ‌రికి మొదటి నుంచీ మనం ఊహించే విధంగానే క్లైమాక్స్ ను ముగించేసాడు ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా కామెడీ తోనూ రాశీ ఖన్నా అందాలతో సినిమా ఐపోయిందనిపిస్తుంది. రామ్ ఎన‌ర్జీతో తోనే సినిమాని లాగే ప్రయత్నం కొంతవరకే ఫలించింది. ఐతే ఇందులో రామ్ లోపం ఏమీ లేదు. ముఖ్యంగా శివం చూస్తున్నంత సేపూ ప్రేక్షకుదికి రెడీ, కిక్, కందిరీగ సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి.

నటీనటుల ప్రతిభ:

రామ్:

ఈ సినిమా లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది ఎందుకంటే రామ్ పాత్రలో ఏ మాత్రం కొత్తదనం లేదు. ప్రేమ కోసం ఏదైనా చేసే కుర్రాడిగా చక్కటి ఎనెర్జీతో నటించాడు రాం. కొత్త ద‌ర్శ‌కుడైన శ్రీ‌నివాస్ రెడ్డి రామ్ కారెక్ట‌ర్ ను మాత్రం బాగానే చూపించాడు. అయితే రామ్ క్యారెక్టర్ లో కిక్, కందిరీగ సినిమాల్లోని హీరో క్యారెక్టర్ ను గుర్తుకు తెప్పిస్తుంది.కొన్ని ఎక్స్ ప్రెషన్లలో రామ్ మరీ కొంచం ఎక్కువ చేసాడనిపిస్తుంది.

రాశీఖ‌న్నా:

ఇక హీరోయిన్ గురించి చెప్ప‌డానికి ఏమీ లేదు నిజానికి న‌ట‌న కంటే ఆమె అందంపైనే ఎక్కువగా దృష్టిపెట్టాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ రెడ్డి. పాట‌లూ, మామూలు సీన్ అని తేడా లేకుండా స్కిన్ షో కే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు. కేవలం రాశీ ఖన్నా ఈ సినిమాలో నటన కంటే ఎక్కువ బాడీ తోనే మార్కులు వేయించుకుంటుంది. ఇంతకన్నా చెప్పేదేం లేదు.

పోసాని:

పోసాని కృష్ణ మురళి ఉన్నంత సేపూ బాగానే అనిపిస్తుంది ఐతే కిక్క్ ఫాదర్ పోలికలు ఎక్కువగా కనిపించటం పోసాని తప్పు కాదు.

ఇక బ్ర‌హ్మానందం, శ్రీ‌నివాస్ రెడ్డి, సప్త‌గిరి పాత్ర‌లు ఓకే అనిపిస్తాయి. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో బ్ర‌హ్మి భ‌యాన్ని ప‌రిచ‌యం చేసే సీన్ బాగా న‌వ్విస్తుంది. ఫిష్ వెంక‌ట్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి పాత్ర‌లు మామూలుగా నే నవ్విస్తాయి. . విలన్ గా చేసిన అభిమన్యు సింగ్, వినీత్ కుమార్ లను కూడా కమేడియన్స్ అనటం వారిని అవమానించినట్టు ఏమాత్రం కాదు. వారికి ఒక పాత్ర లేదు, పాడు లేదు. దాంతో సినిమాలో విలనిజం అసలు లేనేలేదు వాళ్ళని జోకర్ గా చేసి చూపడం వలన ప్రేక్షకుడు చిరాకుగా ఫీలౌతాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించి. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం,రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ముఖ్యంగా  ప్రాణం నా కోసం, ప్రేమ అనే పిచ్చి అనే పాట‌లు విజువలైజ్ చేసిన తీరు బావుంది. ఇక ఎడిటింగ్ ఒక మైనస్. సినిమా లెంత్ ఇంకాస్త త‌గ్గించాల్సింది. సినిమాలో చాలా స‌న్నివేశాలు సాగినట్తుండి బోర్ కొట్టిస్తాయి. పరమ రొటీన్ స్టోరీ ఉన్న ఈ మూస ఫార్ములా సినిమాకు 2 గంట‌ల 50 నిమిషాల సమయం సాగదీసినట్టుగా ఉంటుంది. ఇక ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ రెడ్డి దగ్గరికి వస్తే మొదటి సినిమా కాబ‌ట్టి ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు. ఒకే లైన్ లో రొటీన్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ని ఎంచుకున్నాడు.ఒకే మూస కత ని అన్నిసినిమాలలో ఒక్కొక్క సీన్ నే కలిపి కుట్టినట్టు. అస‌లేమాత్రం కొత్త‌ద‌నం అనే మాటే వాడకుండా ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసేసిన సీన్ల‌తోనే శివ‌మ్ ను సిద్ధం చేసాడు.  వీటితో పటు డైరెక్టర్ కి తను అనుకున్న రాసుకున్న సీన్స్ నే ప్రాపర్ గా తెరపైకి తీసుకురావడం వీలు కాలేదు. తనకి ఇంకా అనుభవం కావాలి. సినిమా ఏయే సినిమాలతో మొదలై ఎలా ఎంద అవుతుంది అంటే.. కిక్ ఇంట్రడక్షన్ ఫార్మాట్ లో మొదలయ్యి అటు నుంచి రెడీ, వెంకీ ఫార్మాట్ లవ్ ట్రాక్ ని మొదలెట్టి, ఇడియట్ తరహాలో టీజింగ్ చేసి, మళ్ళీ కిక్ ఫాదర్ టైపుతో హీరోని పైకి ఎత్తి… ఇలా అతుకుల బొంత కథలో ఎక్కువ భాగం బోర్ కొట్టించే స‌న్నివేశాలే ఎక్కువ‌. స్క్కీన్ ప్లే కూడా వీక్ గానే అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా రాం కి గానీ హీరోయిన్ రాశీ ఖన్నా కి గానీ ఏమాత్రం ప్లస్ కాదు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే కొత్త కథ చూదాలి అనుకునే వారు శివం చూడటం వల్ల కాస్త నిరాశకి లోనౌతారు…

ప్లస్ పాయింట్స్:

  • రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ,
  •  దేవీ సంగీతం,
  • రామ్,
  • నటన,
  • రాశీ ఖన్నా అందం

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ అతుకులబొంత కథ.
  • సాగదీసినట్టుండే కథా, క్లైమాక్స్.
  • వీక్ గా ఉండే విలన్ క్యారెక్టర్స్

 

 

 

(Visited 197 times, 1 visits today)