Home / Political / ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌ నాథ్‌ కోవింద్‌.

ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌ నాథ్‌ కోవింద్‌.

Author:

త్వరలో జరగబోయే దేశ రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. కొన్ని రోజులుగా ఈ అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ‌కు తెరదీస్తూ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న 71 సంవత్సరాల రామ్‌ నాథ్‌ కోవింద్‌ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది ఎన్డీయే కూటమి. వృత్తిరిత్యా న్యాయవాది అయిన రామ్‌ నాథ్‌ కోవింద్‌ గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు, అంతే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌ నుండి రెండుస్లారు రాజ్యసభకు ఎంపికయ్యారు.

ram nath kovind

అక్టోబర్‌ 1, 1945లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పరాంఖ్‌ గ్రామంలో జన్మించిన రామ్‌ నాథ్‌ కోవింద్‌, చిన్న చిన్న పదవులు నిర్వర్తిస్తూ
అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్రపతి పదవికి అభ్యర్థి అయ్యారు. 2015 ఆగస్టు 16 నుంచి బిహార్‌ గవర్నర్‌గా కొనసాగుతున్న రామ్‌ నాథ్‌ కోవింద్‌ మంచి విలువలు ఉన్న వ్యక్తి అని అందుకే ఆయనను తమ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నామని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. ఇదే విషయాన్ని మిగతా పార్టీలకు తెలియజేసామని రామ్‌ నాథ్‌ కోవింద్‌ ని రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మిగాతా పార్టీలు కలిసి వస్తాయని అశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కోన్నారు.

(Visited 604 times, 1 visits today)