Home / Inspiring Stories / ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం

ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం

Author:

శ్రీ రామనవమి వచ్చిందంటే తెలంగాణకు భద్రాచలం రాములవారు ఉన్నారు మరి ఆంద్రప్రదేశ్ కి ఎలా అన్నప్పుడు భద్రాచలం అంతటి అద్భుత పుణ్యక్షేత్రం ఎక్కడ అనగానే గుర్తుకు వచ్చేది ఒంటి మిట్ట రామాలయం. ఇక్కడ ఏకశిలపై వెలసిన కోదండ రామాలయానికి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుండి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీ గా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడ ఉంది. ఇప్పుడు దీనిని “ఆంధ్ర అయోధ్య” అంటున్నారు ఇక్కడి జనమంత.

కడప నుంచి రాజంపేటకు వెళ్ళే ప్రధాన రహదారిలో వెలసిన ఈ ఒంటిమిట్ట రామాలయానికి ఎంతో విశిష్టత ఉందని, రెండో అయోధ్య ఒంటి మిట్ట రామాలయమేనని దేశంలోనే ఇక్కడి రామాలయం ఉన్నట్లు ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో ఒక భావిలాంటిది ఉంది. అది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణలలో వివరించారు. అలాగే ఇక్కడి గోపురం భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఒకటి అని పేరు ఉంది. ఇంక ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. దీంతోపాటు రామలక్ష్మణుల బాణాలతో ఏర్పడిన రామలక్ష్మణ తీర్దాలు ఇక్కడ ప్రత్యేకం, హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ప్రతి శుక్రవారం రోజున హిందువులతో పాటు ముస్లింలు కూడా దర్శించుకుంటారు. ఈ ఆలయంలో రాముల వారి కళ్యాణాన్ని పండు వెన్నెల రాత్రిలో నిర్వహిస్తారు.

(Visited 597 times, 1 visits today)