Home / Videos / “రేంజ్” రోవర్ స్మార్ట్ డ్రైవ్

“రేంజ్” రోవర్ స్మార్ట్ డ్రైవ్

Author:

మన జీవితం ఎంత స్మార్ట్ అయిందో చూస్తూనే ఉన్నాం కదా. ప్రతీదీ మనిషి పడే ఇబ్బందులను తప్పించే లేదా తగ్గించే ప్రయోగమే. ఇప్పుడు అదే ప్రయత్నంలో భాగం గా రేంజ్ రోవర్ కొత్త సిరీస్ లో మరో అడుగు ముందుకేసింది. ఒక రిమోట్ కంట్రోల్ కార్ ని తయారు చేసింది ఓసోస్ మాకు తెలీని రిమోట్ కారా మాపిల్లోడికి మొన్నే కొనిపెట్టాం లేవో అనెయ్యకండీ… ఇది నిజం కారు ఔను నిజం కారునే మీ స్మార్ట్ ఫోన్ నే రిమోట్ గా వాడుకుంటూ డ్రైవ్ చెయొచ్చు. మీరు పక్కనే ఉండీ మీ కారు ని స్తార్ట్ చేసి గేర్,స్పీడ్,బ్రేక్ ఇలా అన్నిటినీ ఆపరేట్ చేసేయొచ్చు. ఐతే మీరు మరీ పూర్తి స్థాయి డ్రైవింగ్ మాత్రం చేయలేరు… పార్కింగ్ నుంచి తీసేటప్పుడో… కాస్త దూరం లో ఉన్న కారు దగ్గరికి నడిచి వెళ్ళే ఓపిక లేనపుడో మాత్రమే దీన్ని వాడగలరు ఎందుకంటే రిమోట్ మోడ్ లో వెహికిల్ వేగం గంటకి నాలుగు కిలోమీటర్లు మాత్రమే.. ఈ మల్టీ పాయింట్ టర్న్ రేంజ్ రోవర్ స్పోర్ట్ చూట్టానికి బానే ఉంది గానీ మన దగ్గరికి రావటానికి కాస్త టైం పట్టొచ్చు…

(Visited 35 times, 1 visits today)