Home / Inspiring Stories / కూతుర్ని రేప్ చేసినోడి చేతులు నరికేసిన తండ్రి.

కూతుర్ని రేప్ చేసినోడి చేతులు నరికేసిన తండ్రి.

Author:

Rape-victim-father-chops-off-hands-of-accused

ఎన్ని చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగటం లేదు… పైగా జువైనల్ అన్న పేరుతో “పసివాళ్ళుగా చెప్పుకొని ఈ బాలపిశాచాలు తప్పించుకుంటున్నాయి. ” దేశాన్నే ఒక కుదుపు కుదిపిన నిర్భయ ఘటనలోని ఒక నేరస్తుడు కేవలం అతని వయస్సు 17 సంవత్సరాలుందన్న కారణంతో అతని శిక్షా కాలాన్ని రెండేళ్ళకు పరిమితం చేసి అతన్ని విడుదల చేసారు. అయితే తన కూతురి విషయంలో శిక్షని ఈ న్యాయస్థానానికి అప్పగించదలుచుకోలేదు ఒక తండ్రి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తన కూతురుపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కాళ్లు విరిచి, మణికట్ల వరకూ చేతులు నరికేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

2014లో తన 8 నెలల కుమార్తెపై అత్యాచారం చేసినట్లు నిందితుడి(17)పై ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. ఈనేపథ్యంలో బాలిక తండ్రి ప్రతీకార దాడి చేశాడు.తన 8 నెలల కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుని రెండు చేతులు నరికేశాడు ఓ తండ్రి. పోలీసులు తెలిపిన వివరాలు..పమ్మా సింగ్ కూతురు, 7 నెలల చిన్నారిని ఏప్రిల్ 2014లో పర్మిందర్ సింగ్ రేప్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.చిన్నారి తండ్రి పమ్మా సింగ్, పర్మిందర్ సింగ్లు ఇద్దరూ కోట్లీ అబ్లూ గ్రామంలో నివాసముంటున్నారు.

ఈ కేసు విషయమై మంగళవారం బతిండా జిల్లా కోర్టులో వీరిద్దరూ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విషయమై మంగళవారం బతిండా జిల్లా కోర్టులో వీరిద్దరూ విచారణకు హాజరయ్యారు. కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత పమ్మా కేసులో రాజీకి వద్దామని పర్మిందర్తో అన్నాడు. దీనికోసం చర్చిద్దామని తన బైక్ పై పర్మిందర్తో కలిసి పమ్మాసింగ్ గ్రామానికి బయలుదేరాడు. జుంబా గ్రామానికి సమీపంలోకి చేరుకోగానే పమ్మా, ఆ పర్మిందర్ సింగ్ ను చెట్టుకు కట్టేశాడు. పదునైన ఆయుధాలతో రెండు చేతులను నరికి వేశాడు.

గమనించిన స్థానికులు పర్మిందర్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. పమ్మా సింగ్ పై హత్యాయత్నం కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. అతను పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.కాగా పైశాచికత్వానికి పరాకాష్ట 8 నెలల పసికందు పై అత్యాచారానికి పాల్పడ్డ పర్మిందర్ సింగ్ కు విదించిన ఈ శిక్ష చట్టప్రకారం నేరం కావచ్చు కాని ఓ తండ్రిగా ఆవేదన చెందిన పమ్మా సింగ్ ను అక్కడి ప్రజలు మెచ్చుకుంటూ అతనికి మద్దతు తెలుపుతున్నారు…

Must Read: సముద్రం లోపలి నుంచి ప్రయాణించనున్న భారత తొలి బుల్లెట్ ట్రైన్.

(Visited 6,449 times, 1 visits today)