Home / Reviews / రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ & రేటింగ్.

రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ & రేటింగ్.

http://telugu.alajadi.com/wp-content/uploads/2017/05/raarandoy-veduka-chudam-movie-review.jpg

Alajadi Rating

2.5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్, జగపతిబాబు, సంపత్, కౌసల్య, వెన్నెల కిషోర్, చలపతిరావు, బెనర్జీ, అన్నపూర్ణ, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్ తదితరులు

Directed by: కళ్యాణ్ కృష్ణ కురసాల

Produced by: నాగార్జున అక్కినేని

Banner: అన్నపూర్ణ స్టూడియోస్

Music Composed by: దేవిశ్రీ ప్రసాద్

వరుస విజయాలతో ఊపు మీదున్న నాగ‌చైత‌న్య.. నాగార్జున కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సోగ్గాడే చిన్నినాయ‌నా దర్శకుడు క‌ళ్యాణ్  కృష్ణ  కాంబినేషన్ లో తెరకెక్కిన  సినిమా రారండోయ్  వేడుక చూద్దాం. సినిమా ఫ‌స్ట్ లుక్ నుంచి, ట్రైల‌ర్ వ‌ర‌కు రోజురోజుకీ అంచ‌నాలు పెంచుతూ వ‌స్తున్న ఈ సినిమా ఇప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమా విజ‌యంతో హ్యాట్రిక్ కొట్టాల‌న్న నాగ‌చైత‌న్య కోరిక తీరుతుందా.. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు అందుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.

http://telugu.alajadi.com/wp-content/uploads/2017/05/raarandoy-veduka-chudam-movie-review.jpg

కథ:

అన‌గ‌న‌గా ముగ్గురు స్నేహితులు. వారిలో ఇద్దరి స్నేహితుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు. వారి సంతానం అనుకోకుండా ఒక పెళ్లిలో క‌ల‌వ‌డం, వారి కలయిక కాస్త ప్రేమగా మారటం జరుగుతుంది. మనస్పర్థలు కల్గిన స్నేహితుల సంతానమే నాగ చైతన్య ( శివ ), రకుల్ ప్రీత్ (భ్రమరాంబ) కావటంతో వీరి పెళ్ళికి అడ్డంగా మారటం జరుగుతుంది. మరి ఆ స్నేహితుల మధ్య మనస్పర్థలు పోతాయా..? చివరికి వీరి శివ, భ్రమరాంబ ల ప్రేమ పెళ్లి వరకు వచ్చిందా… అనేదే ఈ సినిమా కథ.

అలజడి విశ్లేషణ:

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైర‌క్ట‌ర్ గురించి. క‌థలో కొత్త‌ద‌నమేమీ లేక‌పోయినా, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. సినిమా మొత్తానికి ఒక పండుగ వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చాడు. అంద‌రికీ తెల‌సిన ఒక క‌థ‌ను ప్రేక్ష‌కుడికి బోర్ కొట్టించ‌కుండా హ్యాండిల్ చేయ‌గ‌లిగాడు. నాగ చైతన్య ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. చైతూ ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు చెప్పే డైలాగులు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. రకుల్ ప్రీత్ భ్రమరాంబ క్యారెక్టర్ లో చాల అద్భుతంగా నటించింది. రకుల్ తన మునుపటి సినిమాలలో లాగ కాకుండా ఈ సినిమాలో చాల సంప్రదాయ బద్దంగా కనిపించింది. హీరో హీరోయిన్ బ్రేక‌ప్ సీన్ కొంచెం కొత్త‌గా ఉంటుంది. కాక‌పోతే, అది కూడా రామ్ హీరోగా తెర‌కెక్కిన నేను శైలజ సినిమాను త‌ల‌పిస్తుంది. ప్ర‌తీ చోటా డైలాగ్స్ కూడా ఆ సినిమానే గుర్తు చేస్తాయి. వెన్నెల కిషోర్ తో చేసిన కామెడీ ఫ‌ర్వాలేద‌న‌పిస్తుంది. ఫ‌స్టాఫ్ లో పోసాని, తాగుబోతు ర‌మేష్ ల ట్రాక్ విసుగు తెప్పిస్తుంది. హీరో హీరోయిన్స్ మ‌ధ్య కెమిస్ట్రీ సినిమాలో చాలా బాగుంది. వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సీన్స్ కూడా బావున్నాయి.

సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. దేవీశ్రీప్ర‌సాద్ అందించిన పాట‌లు విన‌డానికి, తెర‌పై చూడ్డానికి బాగున్నాయి. బ్రేక‌ప్ అనే పాట మాత్రం బాలేదు. నేప‌థ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగుప‌ర‌చాల్సింది. నాగార్జున అందించిన నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

నాగచైతన్య: నాగచైతన్య మ‌రోసారి కెరీర్‌ బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. నటుడిగా తనకి తానే పెట్టుకున్న పరీక్షలో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడు. త‌న‌కు ఎలాంటి సినిమాలు సెట్ అవుతాయో అలాంటి సినిమాలనే ఎంచుకుంటూ వస్తున్న చైతూ, ఈ సినిమాలో శివ‌గా మెప్పించాడు.

ర‌కుల్: ర‌కుల్ మొద‌టినుంచి చెప్పినట్లు ఇన్నాళ్ల‌కు త‌న‌కు  ఒక మంచి పాత్ర ల‌భించింది. ఆ పాత్ర‌కు 100శాతం న్యాయం చేసింది ర‌కుల్. ప‌ల్లెటూరి అమ్మాయిగా భ్ర‌మ‌రాంబ పాత్ర‌లో ర‌కుల్ బాగా ఇమిడిపోయింది. అంతే కాదు, మొదటిసారిగా ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించిన ర‌కుల్, ట్రెడిష‌న‌ల్ లుక్ లో చాలా ముద్దుగా ఉంది.

జ‌గ‌ప‌తిబాబు: జ‌గ‌ప‌తిబాబు హీరో తండ్రిగా, త‌న ఎమోష‌న్స్ తో మంచి న‌ట‌న క‌న‌బ‌రిచాడు.

సంప‌త్: సంప‌త్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ కి తండ్రి పాత్ర పోషించిన సంపత్, తన కూతురిని ప్రాణంగా గారాబంగా పెంచటం అందరిని ఆకట్టుకుంటుంది

మిగ‌తా నటీనటులు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • నాగ‌చైత‌న్య న‌ట‌న‌
  • ర‌కుల్ క్యారెక్ట‌రైజేష‌న్
  • సంగీతం
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
  • ఫ‌స్టాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్

(Visited 1,345 times, 1 visits today)