Home / Inspiring Stories / దక్షిణాసియా గేమ్స్ లో భారత్ తరపున నేను ఆడాలి… నా కిడ్నీ కొంటారా?

దక్షిణాసియా గేమ్స్ లో భారత్ తరపున నేను ఆడాలి… నా కిడ్నీ కొంటారా?

Author:

Ravi Dixit indian squash player

మన దేశంలో క్రీడాకారులకి కొదవేలేదు వారికి లబించే ప్రోత్సాహంలో తప్ప.. క్రికెట్ కోసం వందల కొట్లు ఖర్చు చేసి ఒక్క కప్ గెలిచిన టీం లో ఎక్స్ట్రా ప్లేయర్లతో సహా కోట్లు కోట్లు ముట్టజెప్తాం… టెన్నిస్ క్రీడలోనూ,బాడ్మింటన్ లోనూ రాణించిన వారి కోసం అకాడమీలకోసం ఎకరాలకు ఎకరాలు, ప్రోత్సాహకాల కింద కోట్లు…. ఇక వేరే రంగంలోని క్రీడా కారుడికి అలాంటి గుర్తింపు రావాలంటే కనీసం అతను ఒలింపిక్ లో ఒక పథకం సాధించాలి లేదంటే అతను మామూలుగా ఏదో స్పోర్ట్స్ కోటాలో వచ్చే ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి,కనీసం అప్పటికి చదువుకొనే పరిస్థితిల్లో ఉంటే చదువు వదిలేసి ఏ రోడ్డు పక్క గప్ చుప్ బండిపెట్టుకొనో,భవన నిర్మాణ కూలీగానో బతికెయ్యాలి.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన స్క్వాష్ క్రీడాకారుడు 20 ఏళ్ల రవి దీక్షిత్ (క్రికెటర్ కాదు కాబట్టి కనీసం ఇతని పేరుకూడా మీరు ఇదివరకు సరిగా విని ఉండరు) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాడు. అంతర్జాతీయ వేదికలపై గెలిచి దేశానికి పలు పతకాలు అందించాడు. ఇదీ ఏదో కొందరికి తప్ప ఎక్కువమందికి తెలిసి ఉండదు. అయినా రవీ దీక్షిత్. తనకు మీడియా కవరేజ్ లేదనో,స్పోర్ట్స్ కోటాలో తనకేమీ అందటం లేదనో బాదపడలేదు. ఆడుతూనే ఉన్నాడు. అయితే ఇక అతని దగ్గర ఇప్పుడు డబ్బూ,ఓపికా రెండూ తగ్గిపోయాయి.వచ్చే నెలలో జరిగే దక్షిణాసియా గేమ్స్ లో పాల్గొనేందుకు తగినంత డబ్బు అందుబాటులో లేదు. స్క్వాష్ క్రీడపై మక్కువతో, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే పట్టుదలతో, కెరీర్ కొనసాగించిందుకు కిడ్నీని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టాడు. ఎవరైనా కొనే వాళ్ళుంటే సంప్రదించమంటూ వివరాలూ ఇచ్చాడు.

నిజానికి రవి మరీ అంత తీసేయదగ్గ వాడేం కాదు. జూనియర్ స్థాయి నుంచే గత పదేళ్లుగా రవి దీక్షిత్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010 ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ పోటిలలో స్వర్ణ పతకం సాధించాడు. ఇంకా ఎన్నో పతకాలు సాధించాడు. అయినా అతణ్ని ఎవరూ ప్రోత్సహించలేదు. శిక్షణ కోసం, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అయ్యే ఖర్చులు భరించలేని పరిస్థితి. దాంతో విసిగిపోయిన రవి ‘”దమ్పూర్ సుగర్ మిల్” నాకు సాయం చేస్తోంది.కానీ వాళ్లు మాత్రం ఎంతకాలమని సాయం చేస్తారు? గౌహతీ లో జరిగే దక్షిణాసియా గేమ్స్ లో భారత్ తరపున నేను ఆడాలి. ఈ టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు చెన్నైలో శిక్షణ పొందాలి. కానీ దానికి సరిపోయేంత డబ్బు నా దగ్గర లేదు.అందుకే నాకున్న రెండు కిడ్నీలలో ఒక దాన్ని అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా. కావాల్సినవారు సంప్రదించండి. కిడ్నీ ధర 8 లక్షల రూపాయలు’ అని పేస్ బుక్ లో రవి దీక్షిత్ పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ చూసిన చాలా మంది స్పందించారు. అతనికి ఎప్పుడూ అండగా ఉంటామని,ఏ సమస్య ఉన్నా తమను సంప్రదించాలని దమ్పూర్ సుగర్ మిల్స్ యాజమాన్యం సూచించింది. యూపీ మంత్రి మూల్చంద్ చౌహాన్ ఈ విషయం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో చర్చించి రవికి సాయం చేస్తామని, త్వరలో అతని కుటుంబాన్ని కలుస్తానని మీడియాకు చెప్పారు.

(Visited 204 times, 1 visits today)