Home / Inspiring Stories / యాసిడ్ దాడి బాధితురాలికి అండగా నిలిచి ఘనంగా పెళ్ళి చేసారు.

యాసిడ్ దాడి బాధితురాలికి అండగా నిలిచి ఘనంగా పెళ్ళి చేసారు.

Author:

ఆమె పేరు లలిత బెన్ బన్సీ. అప్పటిదాకా అందరిలాగే ఆమె కూడా ఆడుతూ పాడుతూ ఆనందంగా బతికింది. కానీ ఒక్క రోజులో ఆమె జీవితం మొత్తం తలకిందులైంది. ఆశలు ఆవిరయ్యాయి, ఆమె ఆలోచనలు మూగబోయాయి.ఇక జీవితంలో ఆనందం లాంటి పదాలు కూడా వినలేను అనుకుంది. ఎందుకంటే ఆమె మొహం ఆమే చూసుకులేనంతగా మారిపోయింది. ఆ అమ్మాయి బంధువే ఆమే పట్ల పగ పెంచుకుని ఆవేశం లో చేసిన యాసిడ్ దాడికి ఆమె మొహం మొత్తం కాలిపోయింది. కరెక్టుగా తన పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఈ యాసిడ్ దాడి జరగడంతో పెళ్లి కూడా ఆగిపోయింది. ఏమి చేయాలో కూడా అర్థం కాని, దిక్కుతోచని స్థితి. ముంబై లో ఒక ఆసుపత్రి లో చేర్పించి ప్రత్యేకంగా  17ఆపరేషన్స్ చేసారు. అయినా ఆమే శరీరం మునుపటిలా కాలేదు, ఇక జీవితమంతా నిరాసక్తత తో గడపాల్సిన్దేనా అనుకునే సమయంలో అనుకోకుండా ఒక రాంగ్ కాల్ చేయడం తో ఆమేకు పరిచయమయ్యాడు రవి శంకర్. అతని పరిచయంతో అసలు నిజమైన  ప్రేమ అంటే ఏంటో ఆమేకు అర్థమయ్యింది. ఎక్కడో కథల్లోనో సినిమాల్లోనో మాత్రమే కనపడే హీరో క్యారెక్టర్ కళ్ళముందు రవి రూపం లో కనపడ్డాడు. కేవలం ఒక మిస్ కాల్ తో పరిచయం అయిన రవి, లలిత ఎవరో ఏంటో తెలియకుండానే, ఆమే ఎలా ఉంటుందో తెలిసి కూడా మనసు పడ్డాడు. ఒకడి కోపానికి బలి అయిన లలిత కి ప్రేమను రుచి చూపించాడు.ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. అంతా ఓకేకానీ రవి శంకర్ వాళ్ళ అమ్మని ఒప్పించడానికి సమయం పట్టింది.. ఏదైతేనేం ఎట్టకేలకు తల్లిని ఒప్పించాడు.

lalitha bansi wedding with ravi

ఇపుడు ఈ ఇరవై ఆరేళ్ళ లలిత బన్సాల్ పెళ్లి గురించే దేశమంతా మాట్లాడుకుంటుంది. పేదింటి బిడ్డలైన రవి శంకర్, లలితల వివాహానికి చాల మంది ప్రముఖులు హాజరు ఆయి వారిని దీవించారు.యాసిడ్ దాడిలో తన మొహం చిద్రం అయినా తట్టుకోని కొత్త జీవితం ఆరంభించబోతున్న లలిత వివాహానికి పలు సంస్థలు ఆర్ధికంగా సహాయం చేసాయి. బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అయితే ఏకంగా ముంబాయి లో ఒక కొత్త ఒక ఫ్లాట్ వారికి పెళ్ళి కానుకగా ఇచ్చాడు. అందరూ లలిత అందంగా లేదన్నారు కాని నాకు తన మనసు, హృదయం తెలుసు..నేను ఆ లలితమైన , స్వచమైన ప్రేమకు బానిసనయ్యాను అని అన్నాడు పెళ్ళి కొడుకు రవి. తన జీవితం లొ ఇక వెలుగే లేదు అనుకున్నఆమె, రవి తో కలిసి ఇపుడు ప్రపంచానికే వెలుగు చూపించే ఆదర్శవంతమైన జంట అయ్యారు, వీరికి అలజడి తరపున శుభాకాంక్షలు.

(Visited 623 times, 1 visits today)