Home / Entertainment / రోడ్లపై హాల్ చల్ చేస్తున్న మాస్‌ మహరాజ్‌.

రోడ్లపై హాల్ చల్ చేస్తున్న మాస్‌ మహరాజ్‌.

Author:

Bengal Tiger Movie Promotions

మాస్‌ మహరాజ్‌ రవితేజ, అందిల భామలు తమన్నా, రాశిఖన్నాలు జంటగా, సంపత్‌ నంది దర్శకత్వంలో, నిర్మాత కెకె రాధామోహన్‌ శ్రీ సత్య సాయి ఆర్టర్స్‌ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్‌ టైగర్‌ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 10న విడుదల కానుంది. బీమ్స్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం రాత్రిపగలు అని తేడా లేకుండా రోడ్లపై హాల్ చల్ చేస్తోంది..దాని స్థావరం వదిలి జనాలు ఉన్న ప్రదేశాలకే వెళ్లుంది..దాన్ని చూసిన జనం కళ్లు అప్పగించడం తప్ప ఏమి చేయడంలేదు..ఇదంతా చదివి నిజమైన బెంగాల్ టైగర్ అనుకోకండి  రవితేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రం..

ఈ చిత్రం డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకోస్తుంది. ప్రోమోషన్ లో భాగంగా చిత్రయూనిట్ ఇప్పటి నుంచే సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తోంది..అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో తిరిగి బస్సులపై బెంగాల్ టైగర్ మూవీ పోస్టర్లను వేసి ప్రమోషన్ ను మొదలుపెట్టింది.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో వందలాది బస్సులపై ప్రమోషన్‌ యాక్టివిటిని స్టార్ట్‌ చేశారు. రోజులో దాదాపు రెండు రాష్ట్రాల్లో కోటికి పైగా ప్రయాణికులు బస్‌ ప్రయాణం చేస్తుంటారు. అలా ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి బెంగాల్‌ టైగర్‌ చిత్రాన్ని చేరాలని, ప్రతి సినిమా ప్రేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా ప్రమోషన్‌ యాక్టివిటి చేస్తున్నారు. డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంద అని నిర్మాత కె.కె.రాధామోహన్‌ అన్నారు. ఈ చిత్రంలో మాస్‌ మహరాజ్‌ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్‌ ఇరాని, బ్రహ్మానందం, రావు రమేష్‌, షియాజి షిండే, నాజర్‌, పోసాని కష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్‌ రానే, పథ్వి, సురేఖవాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగివీడు, ప్రభ, రమాప్రభ తదితరులు నటించగా……ఇప్పటికే పలువాయిదాలు పడ్డ బెంగాల్ టైగర్ బాక్సాఫీస్ పై పంజా విసురుతుందో చూడాలి..

(Visited 64 times, 1 visits today)