Home / Entertainment / పాత్ర కోసం ప్రయోగం చేయనున్నా రవితేజ.

పాత్ర కోసం ప్రయోగం చేయనున్నా రవితేజ.

Author:

Ravi Teja Next Movies

మాస్ మహారాజ్ రవితేజ దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం డైరెక్షన్ లో ‘ఎవడో ఒకడు’ సినిమా చేస్తున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టుకుంది. దీంతో పాటే రవితేజ సుధీర్ వర్మ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయడానికి చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదలా ఉంచితే సుధీర్ వర్మ సినిమాలో తన గెటప్ విషయంలో ప్రయోగం చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేయనున్నాడు, అందులో ఒక పాత్ర 20 ఏళ్ళ కుర్రాడిదైతే, మరో పాత్ర 50 ఏళ్ళ వయసు కలిగిన పాత్ర. ప్రస్తుతం రవితేజ 20 ఏళ్ళ కుర్రాడి పాత్రకి తగ్గట్టుగా కనిపించేలా డైట్ కూడా ఫాలో అవుతున్నాడు. మొదట ఈ ఎపిసోడ్ ని షూట్ చేసేసి ఆ తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి 50 ఏళ్ళ పాత్రకి సంబందించిన షూటింగ్ పూర్తి చేయనున్నారు. రవితేజ ఈ రేంజ్ లో ప్రయోగం చేయడం ఇదే ప్రధమం అని చెప్పాలి. తర్వాత చక్రి అనే న్యూ డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఈ సినిమా కూడా సుధిర్ సినిమా తో పాటే షూటింగ్ జరుగనుంది.

(Visited 100 times, 1 visits today)