Home / Devotional / దేవుడికి తల వెంట్రుకలు ఎందుకు ఇస్తారో తెలుసా…!?

దేవుడికి తల వెంట్రుకలు ఎందుకు ఇస్తారో తెలుసా…!?

Author:

దేవుడికి తలనీలాలు ఇవ్వడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక ఆచారం. దేవుడికి తల వెంట్రుకలు ఎందుకు ఇస్తారో తెలుసా! పోనీ దేవుడి సన్నిధిలోనే తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా! మొక్కు అనుకునే దాని వెనుక అసలు కథ ఏమిటో తెలుసుకోండి.

పురాణాల ప్రకారం మనిషి చేసే ప్రతి పాపపు పని యొక్క ఫలితం ఆ మనిషి జుట్టుకు చేరుతుంది. మనం చేసిన పాపాలు అన్ని మన శిరోజాలలో చేరి మన తలలో తిష్ట వేసి కూర్చుంటాయి. అందుకే దైవ సన్నిధిలో ఆ పాపాలను వదిలి వాటి యొక్క చెడు ఫలితాలు తమతో ఉండొద్దని అందరూ తలనీలాలు సమర్పిస్తారు.

అప్పుడే పుట్టిన శిశువుకు కూడా వెంట్రుకలు ఉంటాయి వాటిలో పూర్వజన్మకు సంబంధించిన ఎవైనా పాపాలు కలిగి ఉంటయన్న నమ్మకంతో చిన్న వయసులోనే పుటెంటుకలు తీస్తారు. శిరోజాలు పాపాలను కలిగి ఉంటాయి కనుకనే వీటిని ” సిరోగతాని పాపాని” అంటారు. దేవుని దగ్గర శిరోజాలు తీస్తే మన శరీరం చాలా తేలిక అవుతుంది దానికి కారణం మన పాపాలు ఒక్కసారిగా తొలగిపోవటం వలనే అలా జరుగుతుంది అంటున్నాయి మన శాస్రాలు.

(Visited 6,556 times, 1 visits today)