Home / Inspiring Stories / మందు తాగే ముందు ఛీర్స్ ఎందుకు చెబుతారో తెలుసా!

మందు తాగే ముందు ఛీర్స్ ఎందుకు చెబుతారో తెలుసా!

Author:

ఈ రోజులలో సంతోషం వచ్చిన భాధ వచ్చిన పోయేది BAR కే ఎందుకంటే మందు మనలో పడితే కానీ సంతోషం రెట్టింపు కాదు, భాధలో ఉంటే మాత్రం మందుకు మించిన ఔషధం లేదు అంటున్నారు మందు ప్రియులు. అయితే ఇక్కడ మందు తాగే ముందు గ్రామలలో పెద్దవారు అయితే మర్యాదగా తీసుకుంటున్న అని చెపుతూ మందు తీసుకుంటారు. కానీ పట్టణాలలో మాత్రం ఛీర్స్‌ అని చెపుతూ మందు తాగుతారు మరి ఇంతకు చీర్స్ ఎందుకు చెపుతారో తెలుసా!

reason for saying cheers
అసలు ఈ చీర్స్ ఆరంభమైంది మాత్రం ఒక అనుమానపు చేష్టగా. ఎందుకంటే మధ్యయుగంలో ఎక్కువగా సముద్రపు దొంగలు ఉండేవారని మనకు తెలిసిన కథ, ఈ ఛీర్స్ సాంప్రదాయానికి వారే ఆద్యులు. ఎందుకంటే వీరు ఎక్కువగా ఓడలను దోచుకునేవారు, ఆ దోచుకున్న సొమ్మును పంచుకోవడానికి, తమ విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఏదైనా దీవిలాంటి ప్రాంతంగానీ, ఎవరికి తెలియని రహస్య ప్రాంతానికి వెళ్ళేవారు. ఆ నిర్మానుష్య ప్రాంతంలో కొందరు దొంగలు తమతోటివారి వాటాలను కాజేయడానికి వారి మద్యంలో విషం కలిపేవారట..! అందువల్ల పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే తాగే  గ్లాసుల్లోని(చెక్క లోటాలు) మద్యం ఒకదానిలోంచి మరోదానిలోకి చిందేలా గట్టిగా తాకించుకోవడం చేసేవారట..! అలా చేసేప్పుడు వారు ‘ఛీర్స్‌ (ఛీర్‌ అంటే ఆనందించు, ఉత్సాహపడు, ఊరటచెందు)’ అనుకునేవారు. అంటే “చావు భయం వద్దు ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే పొందు”  అనేది వారి భావన. ముందు గా ఈ సాప్రదాయం బ్రిటన్‌లో మొదలై  ఆ తర్వాత అది పరిపాలించిన అన్ని రాజ్యాలలోకి ప్రవేశించి మనదాక వచ్చింది. ఇదన్నమాట “ఛీర్స్” వెనుక ఉన్న అర్దం.

Must Read: బీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురుంచి తెలుసుకోండి.

(Visited 2,270 times, 1 visits today)