Home / Inspiring Stories / ఆ ‘టీ స్టాల్’ కి జనం క్యూ కడుతున్నారు, ఎందుకో తెలుసా..?

ఆ ‘టీ స్టాల్’ కి జనం క్యూ కడుతున్నారు, ఎందుకో తెలుసా..?

Author:

ఇప్పుడంతా ఎలాంటి వ్యాపారమైనా యువతను దృష్టిలో పెట్టుకొని మొదలు పెట్టవలసిందే! అది టీ వ్యాపారమైనా, ఫోన్ వ్యాపారమైనా!. ఎందుకంటే మన దేశం యువతరంలో నిండి ఉంది కాబట్టి. ఇలానే ఒక వ్యాపారి యువతరం కోసం ఒక ఐడియాను కనిపెట్టి తన వ్యాపారాన్ని మరింత లాభసాటిగా మార్చుకుంటున్నాడు. అదేంటో ఒకసారి చూద్దాం…

కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఒక వ్యక్తి టీ స్టాల్ పెట్టాడు. వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ అతను అనుకున్న స్థాయిలో జరగటం లేదు మరి వ్యాపారం పుంజుకోవాలమాటే ఏమిటి పరిష్కారం అని ఆలోచిస్తుంటే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే ఆలస్యం దానిని అమలు చేశాడు అంతే వ్యాపారం ఒక్కసారిగా పుంజుకుంది. ఇప్పుడు అతని టీ స్టాల్ కు జనం క్యూ కడుతున్నారు. మరి ఆ వ్యాపారి ఆలోచన మంత్రం ఏమిటి అని ఆలోచిస్తున్నారా! ప్రీ వైఫై అందించడమే!…

tea-stall

ఇలాంటి ఫ్రీ వైఫై విధానం రైల్వే స్టేషన్ లలో, బస్టాండ్లలో, పెద్ద, పెద్ద షాపింగ్ మాల్స్ లలో అమలు చేస్తున్నా వారికి ఏమాత్రం కలిసి వస్తుందో తెలియాదు కానీ ఈ చిరు వ్యాపారికి మాత్రం బాగా కలసి వస్తుంది. తన టి స్టాల్ కి వచ్చే ప్రతి వ్యక్తి ఒక 5 రూపాయల టీ ఆర్డర్ చేసి అరగంట పాటు ప్రీ వైఫై ఉచితంగా వాడుకుపోవచ్చు అనే ప్రకటన తన టీ స్టాల్ చుట్టూ ఉండే ప్రాంతంలో బాగా ప్రచారం పొందింది. దానితో ఉదయం నుండి రాత్రి షాప్ మూసే సమయం వరకు ఎప్పుడు కాలిగా ఉడటం లేదు కష్టమర్లతో నిత్యం బిజీగా మారిపోయింది అని 23 సంవత్సరాల వ్యాపారి చెబుతున్నాడు. ఈ విధానం ఈ సెప్టెంబర్ నుండి అమల్లోకి తెచ్చాడు. ఈ ప్రీ వైఫై విధానము ప్రతి కష్టమర్ కి అరగంట మాత్రమే లభించి అరగంట కాగానే ఆటోమేటిక్ గా డిస్ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రీ వైఫై విధానం వలన 100 కప్పుల టీ అమ్మే నుండి అతను ఇప్పుడు దాదాపు 500 కప్పులు అమ్మే స్థాయికి వ్యాపారం పెరిగిందట….. ఏమైనా ఒక్క చిన్న ఆలోచన తన వ్యాపార వృద్ధికి బాగానే ఉపయోగపడింది. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా మన ఆలోచనలని కూడా అప్ గ్రేడ్ చేసుకుంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని ఈ టీ స్టాల్ యజమానిని చూసి నేర్చుకోవచ్చు.

(Visited 4,172 times, 1 visits today)